రౌడీ బాయిస్ కోసం రీమిక్స్ లు

నిర్మాత దిల్ రాజు తన రౌడీ బాయిస్ సినిమా కోసం ఏ ఒక్క కమర్షియల్ పాయింట్ ను వదలడం లేదు. తన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డిని తొలి సినిమాను ఎలాగైనా హిట్…

నిర్మాత దిల్ రాజు తన రౌడీ బాయిస్ సినిమా కోసం ఏ ఒక్క కమర్షియల్ పాయింట్ ను వదలడం లేదు. తన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డిని తొలి సినిమాను ఎలాగైనా హిట్ దారి పట్టించాల్సిందే అని ఆయన సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగా సినిమాలో నలుగురు సీనియర్ హీరోల పాటలు రీమిక్స్ చేయించినట్లు తెలుస్తోంది. చిరంజీవి, నాగార్ఙున, బాలకృష్ణ, వెంకటేష్ ల నాలుగు హిట్ సాంగ్ లు తీసుకుని, ఒక్కోటి వన్ అండ్ హాఫ్ మినిట్ వంతున రీమిక్స్ చేయించారట.

సినిమాలో హీరో రౌడీ బాయిస్ అనే బ్యాండ్ ను నడుపుతాడు. ఆ బ్యాండ్ ఈ రీమిక్స్ పాటలను ఆలపిస్తుందన్నమాట. చిరు శంకర్ దాదా లోని పట్టు పట్టు చేయేపట్టు సాంగ్ ను, నాగ్ మన్మధుడు, వెంకీ చంటి సినిమాలో పాటలను రీమిక్స్ కోసం తీసుకున్నారు. మరి బాలయ్య పాట ఏ సినిమాలోంచి తీసుకుని వుంటారో.

మొత్తానికి కుర్రకారు సినిమాలో సీనియర్ల పాటలు రీమిక్స్..ఐడియా బాగానే వుంది.