సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, ఓకప్పటి హీరో రమేష్ బాబు మరణించారు. హీరో మహేష్ బాబుకు ఈయన సోదరుడు.
రమేష్ వయసు 56 సంవత్సరాలు గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహేష్ కన్నా ముందుగా రమేష్ నే సినిమా రంగ ప్రవేశం చేసారు. దాసరి చేసిన కొత్త ప్రయత్నం నీడ సినిమాతో ఆయన తన కెరీర్ ప్రారంభించారు.
చాలా సినిమాలు చేసారు కానీ, హీరోగా క్లిక్ కాలేకపోయారు. ఆ తరువాత మెలమెల్లగా తెరకు దూరం అయ్యారు. నిర్మాతగా మారి మహేష్ తో కోన్ని సినిమాలు కూడా నిర్మించారు. ఆ తరవాత ఇక పెద్దగా రమేష్ గురించి బయట ప్రపంచానికి తెలియకుండా అయింది.
ఆయన ఎప్పుడూ ఇంట్లోనే వుంటారని, ఎవ్వరితోనూ పెద్దగా కలవరని వార్తలు వినిపించేవి. లివర్ సమస్యతో బాధపతున్న ఆయన ఎఐజి లో చికిత్స పొందుతున్నారు. ఆఖరికి అదే సమస్య ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది.