కోవిడ్ మొదటి దశ కొంత మందికే సోకింది. రెండో దశ చాలా మందిని చుట్టేసింది. మూడోదశ మిగిలి పోయిన వారిని కూడా టచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కరోనా తొలి రెండు దశల్లో భయంకరమైన ఙాగ్రత్తలు తీసుకున్న సినిమా ప్రముఖుల్లో హీరో మహేష్ బాబు ఒకరు. బయటకు రాకుండా, ఇంట్లో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇటీవల మెడికల్ అవసరాల రీత్యా విదేశాలకు వెళ్లారు. కొన్నాళ్లు అక్కడే వున్నారు. ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చారు. పరిక్ష చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మహేష్ బాబే తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు.
మంచు మనోజ్, మంచు లక్ష్మి లకు కూడా ఇటీవలే పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో కూడా కోవిడ్ ధర్డ్ వేవ్ అలుముకుంటున్నట్లు కనిపిస్తోంది. గురువారం నాడు రెండు వేల కేసుల వరకు వచ్చాయి.