జీవితం ఎలాంటి సవాళ్లు విసిరినా ధైర్యంగా, బలంగా ముందుకు సాగుతూనే వుంది హీరోయిన్ సమంత. టేకప్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా పేరు తెచ్చుకుంటూనే వుంది. ఫ్యామిలీమన్ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చింది.
పుష్పలో అయిటమ్ సాంగ్ అనగానే జనం ఏంటో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పాటే వైరల్ అయిపోవడం మాత్రమే కాదు, పుష్ప సినిమాను నిలబెట్టిన ఫస్ట్ పాయింట్ అయింది.
ఎక్కడ చూసినా ఊ అంటావా..ఊ ఊ అంటావా అంటూనే సినిమా జనం ఊగిపోతున్నారు. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన 39 సెకెండ్ల చిన్న మేకింగ్ విడియో ను సమంత యూ ట్యూబ్ లో విడుదల చేసింది. సాధారణంగా ఐటమ్ సాంగ్ లో ఎలాంటి డ్రెస్ వేసుకుని ప్రాక్టీస్ చేసినా, రిహార్సల్స్ కు మాత్రం అంత చిట్టి పొట్టి దుస్తులు వేసుకోరు.
కానీ సమంత ఈ పాట రిహార్సల్ లో స్కిన్ టైట్ డ్రెస్ తో కొంత పార్ట్, చిన్న షార్ట్ తో మారో పార్ట్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అసలే ఆ పాట మూవ్ మెంట్ లు సూపర్ మాస్ గా వుంటాయి. దానికి తోడు ఈ డ్రెస్ లు. సమంత మొత్తం మీద మెరిసిపోయింది.
మరో విశేషమేమిటంటే సమంత స్వంత యూ ట్యూబ్ చానెల్ లో విడుదల చేసిన రెండో విడియో ఇది.