నిర్మాతగా ఎలా వున్నా డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీని గుప్పిట్లో వుంచుకున్నారు దిల్ రాజు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. కోటి రూపాయలు తగ్గించి అయినా సినిమాలు ఆయనకే ఇవ్వాలి కానీ వేరేవాళ్లకు ఇవ్వడం కష్టం. ఆయన, ఆయన పార్టనర్ శిరీష్ ప్లానింగ్ అలా వుంటుంది.
పండగ సినిమాల వ్వవహారాన్ని ముందుగానే అంచనా వేసి, ఉత్తరాంధ్రలో థియేటర్లు అన్నీ ఆయన ముందుగానే బ్లాక్ చేసి, అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. దాంతో అన్ని సినిమాలు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఎంత మంచి వాడవురా మాత్రం ఉత్తరాంధ్ర ఆయనకు ఇవ్వలేదు.
దాంతో ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆ సినిమాకు పట్టుమని 15 థియేటర్లు దొరకడం కష్టమైంది. మూడు జిల్లాల్లో కలిపి ఆ సినిమాకు దొరికిన థియేటర్లు అంతే. దర్బార్ సినిమా దాదాపు 20 థియేటర్లలో వుంది. వీటిలో చాలా థియేటర్లు షోకి వెయ్యి, రెండు వేలు వస్తున్నవే. అయినా ఖాళీ చేయకుండా రెంట్ పే చేస్తూ తన చేతిలో వుంచుకున్నారు దిల్ రాజు.
ఖాళీ చేస్తే ఎంత మంచివాడవురా సినిమా వేసుకుంటారు. కానీ అది తనకు రాలేదు. అందుకే రెంట్లు భరించి మరీ దర్బార్ ను అలాగే వుంచారు. నిజానికి పండగ టైమ్ లో ఇలా వుంచడం వల్ల థియేటర్లకు నష్టమే. క్యాంటీన్ ఇన్ కమ్, పార్కింగ్ ఇన్ కమ్ రాదు. కొన్ని టికెట్ లు అయినా అదనపు రేట్లకు లెఫ్ట్ లో అమ్ముకునే అవకాశం రాదు.
కానీ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్క సీజన్ కోసం చూసుకంటే, మిగిలిన ఏడాది అంతా దిల్ రాజు నుంచి సినిమాలు రావు. అందుకే మాట్లాడకుండా వుంటున్నారు ఎగ్జిబిటర్లు. కానీ తెలుసుకోవాల్సింది ఒకటే సినిమా బాగాలేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ వన్స్ బాగున్న సినిమా అనిపించుకుంటే, థియేటర్లు అవే వస్తాయి. కానీ అంత వరకు బయ్యర్ ఓపిగ్గా వుండాలి.
ఇంతకీ ఈ సంగతి నందమూరి బ్రదర్స్ దృష్టికి వెళ్లిందో లేదో?