cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ విజయం మహేష్ దే-అనిల్ రావిపూడి

ఈ విజయం మహేష్ దే-అనిల్ రావిపూడి

సరిలేరు నీకెవ్వరు. సూపర్ స్టార్ మహేష్-డైరక్టర్ అనిల్ రావిపూడి కలిసి తయారు చేసిన ఫన్ ఎంటర్ టైనర్. ఈ సినిమా విడుదలై రెండు రోజులు అయింది.

సినిమా విడుదలకు ముందు అనిల్ రావిపూడి 'గ్రేట్ ఆంధ్ర' తో మాట్లాడారు. తరువాత కూడా మళ్లీ ఆయన సంతోషం 'గ్రేట్ ఆంధ్ర' తో పంచుకున్నారు. ఈ ముచ్చట్లు ఇవి.

ఏ లెవెల్ ఆనందంలో వున్నారు

లెవెల్ అని కాదు. కొలమానం లేదు. అంత మంచి విజయం దక్కింది మా యూనిట్ కు.

అన్నింటి కన్నా గొప్ప అభినందన ఎవరి నుంచి వచ్చింది?

మహేష్ నుంచే. బహిరంగ వేదిక మీద పిలిచి మరీ హగ్ ఇచ్చారు. అంతకన్నా మించినది ఏముంటుంది?

యూనిట్ జనాల సంగతి కాదు, బయట జనాల నుంచి.

వెంకటేష్ బాబు చూసి ఫోన్ చేసి అభినందించారు. రాఘవేంద్రరావు గారు. ఇలా ఒకరు ఇద్దరు అని కాదు, చాలా మంది నుంచి. ఇక ఫ్యాన్స్, అభిమానుల వాట్సప్ మెసేజ్ లకు అంతే లేదు. ఫలానా సీన్ బాగుంది..ఫలానా సీన్ పండింది అంటూ.

సినిమా సాధించిన విజయం ఏదైతే వుందో?దానికి క్రెడిట్ మీదా? లేదా మరెవరిది?

ముమ్మాటికీ మహేష్ బాబుదే క్రెడిట్. ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేసి చాలా కాలం అయింది. అందుకే ఈ విషయం సాధ్యమైంది.

కానీ ట్రయిన్ జర్నీ సీన్ కానీ, బండ్ల గణేష్ సీన్ కానీ మీరు చెప్పిన మేరకు వచ్చాయా?

ఏ సీన్ గురించి మేము ఎప్పుడూ ఇంత అంత అని చెప్పలేదు. ముఖ్యంగా బండ్ల గణేష్ సీన్ గురించి మీడియానే ఏవేవో ఊహించుకుంది. అయినా ట్రయిన్ సీన్ జనాలకు బ్రహ్మాండంగా నచ్చింది. బి. సి సెంటర్ల ఆడియన్స్ పడి పడి నవ్వుతున్నారు.

సినిమాలో కథ మరీ థిన్ లైన్ గా వున్నట్లు లేదూ?

ఏ సినిమాకు అయినా లైన్ థిన్ గానే వుంటుంది. అందుకే దాన్ని లైన్ అంటారు. ఆ లైన్ చుట్టూ అల్లుకున్నసీన్లతో కలిపి కథ తయారవుతుంది. మీరు బాహుబలి చూసుకున్నా లైన్ థిన్ నే. దాయాదుల మధ్య నలిగిన రాజమాత, తండ్రికి జరిగిన అన్యాయం మీద పగతీర్చుకున్న తనయుడు ఈ విధంగా ఒక్క లైన్ లో చెప్పేయచ్చు. కానీ సినిమాలో చూస్తే అలా వుండదు. సినిమా చుట్టూ బోలెడు ప్యాడింగ్ వుంటుంది. 

ఇలాంటి జోనర్ లో ప్రభుత్వాల జవాబుదారీ తనం, రాష్ట్రాలకు ఆధార్ కార్డు వంటి సందేశాలు అవసరమా?

అక్కడ స్పేస్ దొరికింది. విలన్ చేసింది స్కామ్. అలాంటి స్కామ్ లు అరికట్టాలి అంటే మార్గం ఏదో ఒకటి వుండాలి.

జనాల జమా ఖర్చులను మోనిటర్ చేస్తున్నారని ఇన్ కమ్ టాక్స్ వాళ్లని నిలదీసారా?

సమస్య లేదు. వాళ్లు బాగానే చేస్తున్నారనే చెప్పాం. కానీ వాళ్లు పెర్ ఫెక్ట్ గా పని చేసి తెచ్చిన ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టకూడదని చెప్పాం.

ఈ సినిమాతో మీరు పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ అందించినట్లు అయింది. ఇంటర్వెల్ ఫైట్, అడవిలో ఫైట్..అనిల్ రావిపూడి కాస్తా అనిల్ బోయపాటిగా మారుతున్నారా?

అమ్మో..అంత లేదు. ఆయన స్టయిల్, ఆయన సినిమాలు వేరు. నా సినిమాలు వేరు.

సినిమాలో హీరోయిన్ కు తగినంత పాత్ర దొరికినట్లు లేదు?

కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలో హీరోయిన్ లకు ఏ మేరకు పాత్ర వుంటుందో మీకు తెలియదా? కానీ మేము ద్వితీయార్థంలో పరిశోధనలో ఆమెను చేర్చి, నామినల్ పాత్ర అని కాకుండా, కథలో భాగంగా చేసాం. 

మైండ్ బ్లాక్ సాంగ్ లో గాలిలో పల్టీ కొడుతూ డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది హీరోయిన్. రష్మికయే చేసిందా?

హండ్రెడ్ పర్సంట్. ఓసారి ఆమె జిమ్ లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ తీసిన విడియో నాకు చూపించింది. అది చూసి ఈ సాంగ్ లో ఆ బిట్ పెట్టాను.

రమణా లోడొచ్చింది..ఈ ఫన్ బిట్ అయిడియా ఎవరిది?

సినిమాలో ఎమోషన్ మినహా మరెక్కడా ఫన్ వదల కూడదన్నది నా ప్లాన్. అందుకే పైట్లలో కూడా ఫన్ టచ్ ఇచ్చాను. అందులో భాగంగానే వచ్చిన ఐడియా ఇది.

విజయశాంతి క్యారెక్టర్ కు హీరో క్యారెక్టర్ శాల్యూట్ చేసే ఐడియా ఎవరిది? 

అది ముందుగా స్క్రిప్ట్ లో భాగంగా వచ్చిందే. ఇద్దరు కొడుకులు వుంటే ఇద్దరినీ దేశరక్షణకు పంపిన తల్లికి ఇవ్వగలిగిన మాగ్జిమమ్ రెస్పెక్ట్ ఏమిటి? అన్న ఆలోచనలోంచి వచ్చిందా అయిడియా.

సరిలేరు నీకెవ్వరు సినిమా మీద మీకుగా మీకు ఎక్కడయినా అసంతృప్తి వుందా?

నో ఛాన్స్. అది పెర్ ఫెక్ట్ బ్లెండ్. క్లాస్-మాస్-ఫన్ ఎంటర్ టైనర్. థియేటర్లలో జనాలకు వన్ పర్సంట్ అసంతృప్తి మిగల్చని సినిమా.

 


×