మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. బాబు ఏది చేసినా ఎల్లో మీడియా ఆహా, ఓహో అని ఆకాశమే హద్దుగా కీర్తిస్తుంటే, సోషల్ మీడియా దాన్ని ఎప్పటికప్పుడు బలంగా తిప్పి కొడుతోంది. అంతేకాదు సృజనాత్మక విమర్శలతో బాబు వైఖరిని సోషల్ మీడియా తూర్పారపడుతోంది.
కడపకు చెందిన ఎ.రఘు అనే సామాజిక కార్యకర్త బాబు రాజకీయ జిత్తుల మారి ప్రస్థానాన్ని, కుట్రలు, కుతంత్రాలను, వాటికి అండగా నిలిచే పత్రికలను, ఎప్పుడూ ఇతర పార్టీల కాళ్లపై నిలబడే అసమర్థతను నాలుగు వాక్యాల్లో ప్రతిభావంతంగా తిప్పి కొట్టారు. ఆయన రాసిన నాలుగు మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉద్యమాల్లో మహిళలను అడ్డు పెట్టుకుంటావ్ !
న్యాయ వ్యవస్థలో శ్రేయోభిలాషులను అడ్డు పెట్టుకుంటావ్ !
ఎన్నికల్లో భావసారూప్యతలేని పార్టీలను అడ్డు పెట్టుకుంటావ్ !
పార్టీ బతకడానికి ఎన్టీఅర్ కుటుంబాన్ని అడ్డు పెట్టుకుంటావ్ !
అబద్ధాల ప్రచారం కోసం ఆ కరపత్రాలను అడ్డు పెట్టుకుంటావ్ !
ఎక్కడ బాబుగారూ ! ఎప్పుడు బాబుగారూ !
రొమ్ము చూపి ప్రత్యర్థులతో ధైర్యంగా పోరాడింది?
గంగిగోవు పాలు గరిటడైన చాలు అనే వేమన శతకంలో చెప్పినట్టు బుల్లెట్ లాంటి పదాలు రెండైనా చాలు. బాబు ద్వంద్వ ప్రమాణాలపై సామాజిక కార్యకర్త రఘు రాసిన నాలుగు వాక్యాలు బుల్లెట్‌లా దూసుకుపోతున్నాయ్. ఈ నాలుగు వాక్యాలు అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టున్నాయి.
ప్రతి వాక్యం ఒక్కో దశలో చంద్రబాబు నైజాన్ని నిటారుగా నిలిపి కళ్లకు కట్టింది. ఇంతకంటే ఒక అక్షరం చేయదగ్గ గొప్ప కార్యం ఏముంటుంది?