పవర్ స్టార్ తో పూజ హెగ్డే?

డిజె, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, నాలుగు హిట్ లు తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. అవే కాదు, రంగస్థలం, వాల్మీకి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్. ఇలా చేసిన ప్రతి సినిమా…

డిజె, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, నాలుగు హిట్ లు తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. అవే కాదు, రంగస్థలం, వాల్మీకి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్. ఇలా చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ లక్కీ గర్ల్ అనిపించుకుంటోంది. ప్రభాస్ తో ఓ సినిమా చేతిలో వుంది. 

ఇప్పుడు ఓ మాంచి ఆఫర్ ఆమెతో డిస్కషన్ లో వుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఆఫర్ వుంది. పింక్ సినిమా రీమేక్ లో హీరోయిన్ పాత్ర చిన్నది. అయితేనేం ఓ డ్యూయట్ కూడా వుంది. పవన్ కళ్యాణ్ సరసన చిన్నదైనా పెద్దదైనా పాత్ర దొరికితే వేయాలనుకునే హీరోయిన్లు చాలా మంది వుంటారు. ఇప్పుడు ఆ చాన్స్ కు తయారుచేస్తున్న జాబితాలో పూజా పేరు ఫస్ట్ ప్లేస్ లో వుంది.

కియారా అద్వానీ పేరు వినిపించింది కానీ ఆమె మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది పైగా ఓకె అంటుందా?  అన్నది అనుమానం. అయితే పూజా అయితే తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇస్తోంది. లక్కీ లెగ్ అని ప్రూవ్ చేసుకుంది. అందుకే ఆమె పేరు జాబితాలో ఫస్ట్ న వుంది.