అనూప్ మరో పెద్ద హిట్ కొట్టబోతున్నాడా?

చిన్న సినిమాలకు తన మ్యూజిక్ తో పెద్ద హిట్ ఇవ్వడం అనూప్ రూబెన్స్ స్టయిల్. ఇంతకుముందు ఇలాంటి మేజిక్స్ చాలానే చేశాడు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాకు హైప్ రావడానికి కారణం…

చిన్న సినిమాలకు తన మ్యూజిక్ తో పెద్ద హిట్ ఇవ్వడం అనూప్ రూబెన్స్ స్టయిల్. ఇంతకుముందు ఇలాంటి మేజిక్స్ చాలానే చేశాడు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాకు హైప్ రావడానికి కారణం అనూప్ కంపోజ్ చేసిన సాంగ్. ఆ ఒక్క పాటతో ఆ సినిమా పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు అలాంటిదే అనూప్ మరో సాంగ్ ఇచ్చాడంటున్నారు నెటిజన్లు.

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా శేఖర్. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. లవ్ గంటే మోగిందంట అనే లిరిక్స్ తో సాగే ఈ పాట వినగానే ఆకట్టుకుంటోంది. కొత్త ఏడాదిలో ఫస్ట్ హిట్టయ్యే సాంగ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. విజయ్ ప్రకాష్, రేవంత్ తో కలిసి అనూప్ రూబెన్స్ పాడాడు. క్యాచీ ట్యూన్ తో వచ్చిన ఈ పాట మాత్రం వినడానికి చాలా బాగుంది. ఈ సాంగ్ కు నిజంగా అంత దమ్ముందా లేదా అనే విషయం మరో 2-3 రోజుల్లో తేలిపోతుంది.

లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్, జీవిత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ రీమేక్ సినిమాకు జీవిత దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిపెట్టారు. కెరీర్ లో రాజశేఖర్ కు ఇది 91వ సినిమా.