చిన్న సినిమాలకు తన మ్యూజిక్ తో పెద్ద హిట్ ఇవ్వడం అనూప్ రూబెన్స్ స్టయిల్. ఇంతకుముందు ఇలాంటి మేజిక్స్ చాలానే చేశాడు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాకు హైప్ రావడానికి కారణం అనూప్ కంపోజ్ చేసిన సాంగ్. ఆ ఒక్క పాటతో ఆ సినిమా పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు అలాంటిదే అనూప్ మరో సాంగ్ ఇచ్చాడంటున్నారు నెటిజన్లు.
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా శేఖర్. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. లవ్ గంటే మోగిందంట అనే లిరిక్స్ తో సాగే ఈ పాట వినగానే ఆకట్టుకుంటోంది. కొత్త ఏడాదిలో ఫస్ట్ హిట్టయ్యే సాంగ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. విజయ్ ప్రకాష్, రేవంత్ తో కలిసి అనూప్ రూబెన్స్ పాడాడు. క్యాచీ ట్యూన్ తో వచ్చిన ఈ పాట మాత్రం వినడానికి చాలా బాగుంది. ఈ సాంగ్ కు నిజంగా అంత దమ్ముందా లేదా అనే విషయం మరో 2-3 రోజుల్లో తేలిపోతుంది.
లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్, జీవిత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ రీమేక్ సినిమాకు జీవిత దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిపెట్టారు. కెరీర్ లో రాజశేఖర్ కు ఇది 91వ సినిమా.