మా కలెక్షన్లు కరెక్ట్..వాళ్లవే తప్పు

నిన్నటి వరకు దాదాపు నెల రోజులుగా ఒకటే హడావుడి. మహేష్ -అనిల్ రావిపూడి సినిమా, అలాగే బన్నీ-త్రివిక్రమ్ సినిమా. తెగ హడావుడి. వీర టెన్షన్. ఇండస్ట్రీ జనాలు ఏ ఇద్దరు కలిసినా ఆ రెండు…

నిన్నటి వరకు దాదాపు నెల రోజులుగా ఒకటే హడావుడి. మహేష్ -అనిల్ రావిపూడి సినిమా, అలాగే బన్నీ-త్రివిక్రమ్ సినిమా. తెగ హడావుడి. వీర టెన్షన్. ఇండస్ట్రీ జనాలు ఏ ఇద్దరు కలిసినా ఆ రెండు సినిమాల కబుర్లే. సరే రెండు సినిమాలు విడుదల అయిపోయాయి. దేని జోనర్ దానిదే. దేని రివ్యూలు దానివే.

అయితే ఇక ఇప్పుడు కలెక్షన్ల హడావుడి ప్రారంభమైంది. తొలిరోజే 46.77 కోట్ల షేర్ అంటూ మహేష్ సినిమా వైపు నుంచి ఓ కార్డ్ వచ్చేసింది. పైగా ఆ కార్డ్ ను నిర్మాత అనిల్ సుంకర నే ట్వీట్ చేయడం విశేషం. అక్కడితో ఆగకుండా తొలి రోజే బయ్యర్లు సగానికి పైగా వెనక్కు తెచ్చేసుకున్నారని ఆయన ప్రకటించారు.

సరిలేరుకు తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయన్నది వాస్తవం. ఎందుకంటే సినిమాకు మాంచి బజ్ వచ్చింది. అదనపు ఆటల అనుమతి వచ్చింది. భారీ రేట్లు వచ్చాయి. అన్నింటికి మించి 80 శాతం థియేటర్లలో అదే సినిమా వేసారు. అందువల్ల మంచి అంకెలు కనిపించాయి. కానీ యూనిట్ నుంచి వచ్చిన అంకెలు పక్కా కరెక్ట్ నా కాదా? అన్నది మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అది నిర్మాతలకు, బయ్యర్లకే తెలియాలి. 

తొలిరోజు సరిలేరుకు నైజాంలో ఎనిమిది కోట్ల మేరకు షేర్ చూపించారు. కానీ అసలు ఫిగర్ ఆరుకోట్లకు పైగా అన్న గుసగుసలు కూడా వున్నాయి. ఇదిలా వుంటే అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్ ఫిగర్లు బయటకు వచ్చాయి. దాంతో గడబిడ స్టార్ట్ చేసారు. అన్ని థియేటర్లు అన్ని షో లు వుంటే ఆ ఫిగర్లు వచ్చాయి. అంతకన్నా తక్కువ థియేటర్లు, తక్కువ షో లు అయినపుడు, సరిలేరుతో సమానంగా అల వైకుంఠపురములో సినిమాకు ఫిగర్లు ఎలా చూపిస్తారు అన్న క్వశ్చన్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ తేడా వుంటుందనే థియేటర్ ల ఫిక్స్ డ్ హయ్యర్లు, ఇతరత్రా వ్యవహారాలు కలిపి చూపించారనే టాక్ వుంది. అయితే ఇది కామన్ అని, అన్ని సినిమాలకు అలాగే చూపిస్తున్నారని, ఈ మధ్య జి ఎస్ టి కలపడం కూడా అలవాటు చేసారని కూడా కౌంటర్ కామెంట్ వినిపిస్తోంది. 

ఇలా వీళ్ల కలెక్షన్ల మీద వాళ్ల కామెంట్లు, వాళ్ల కలెక్షన్ల మీద వీళ్ల కామెంట్లు వినిపిస్తున్నాయి.మొత్తం మీద వీటన్నింటి ద్వారా ఒకటి మాత్రం క్లియర్ అవుతోంది. వినిపిస్తున్న కలెక్షన్ల ఫిగర్లు ఏవీ కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ కోసం, హీరో ల ప్రెస్టీజ్ కోసం చేస్తున్న హడావుడి తప్ప వేరు కాదు. ఓవర్ సీస్ లో మాదిరిగా పర్ ఫెక్ట్ ఫిగర్లు వచ్చే చాన్స్ తెలుగు రాష్ట్రాల్లో లేదు. అలాంటి పరిస్థితి వచ్చేవరకు ఎవరికి వారు వాళ్ల వాళ్ల సినిమాల కలెక్షన్లు వంద కోట్లు, రెండు వందల కోట్లు దాటించేసుకోవడమే. 

అసలు లెక్కలు బయర్లకు తెలుస్తోంది. ఆ హీరోల తరువాత సినిమాలకు ఆ బయ్యర్లకు సైలంట్ గా రేటు తగ్గించి సినిమా ఇచ్చి శాటిస్ ఫై చేస్తారు. టోటల్ గా ఒకటే మాట, వీళ్లవి అయినా, వాళ్లవి అయినా కలెక్షన్ల కార్డులు చూసి లైట్ తీసుకోవడం తప్ప హడావుడి అనవసరం.

బయ్యర్లందరూ అప్పుడే మూట కట్టుకున్నారు:అల్లు అరవింద్‌