సోనూసూద్ రేటు చాలా హట్ గురూ

కరోనా నేపథ్యంలో అపర దానకర్ణుడు అనిపించుకున్నాడు నటుడు సోనూ సూద్. విలన్ వేషాలు వేసినా, మనసు మాత్రం హీరోయిజం చూపించింది. ఆ విధంగా సోనూ సూద్ పేరు దేశం మొత్తం మీద మారుమోగాపోయింది. Advertisement…

కరోనా నేపథ్యంలో అపర దానకర్ణుడు అనిపించుకున్నాడు నటుడు సోనూ సూద్. విలన్ వేషాలు వేసినా, మనసు మాత్రం హీరోయిజం చూపించింది. ఆ విధంగా సోనూ సూద్ పేరు దేశం మొత్తం మీద మారుమోగాపోయింది.

ఇలాంటి నేపథ్యంలో సోనూ సూద్ మీద తెలుగు వాళ్ల కన్ను మళ్లీ పడింది. గతంలో విలన్ వేషాలు వేసినా, మాంచి ఫిజిక్, పర్సనాలిటీ వుండడంతో చాలా మంది హీరోలు స్మూత్ గా అతన్ని పక్కన పెట్టారు.

ప్రస్తుతానికి బెల్లంకొండ సాయి సినిమాలో చేస్తున్నాడు సోనూ సూద్. డైరక్టర్ బోయపాటి ఏరి కోరి సోనూ సూద్ ను బాలయ్య సినిమాలోకి తీసుకోవాలని అనుకున్నాడు.

అంతకు ముందు ఈ క్యారెక్టర్ కోసం సంజయ్ దత్ ను అనుకున్నారు. కానీ ఆయనేమో సిక్ అయ్యాడు. దాంతో సోనూసూద్ ను పిఫర్ చేసి, వెళ్లి అడిగినట్లు తెలుస్తోంది. 

దానికి సోనూ ఓకె అన్నాడు కానీ చెప్పిన రేటే ఘాటుగా వుందట. జస్ట్ నాలుగు కోట్లు రెమ్యూనిరేషన్ అడిగినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు సోను కు ఇచ్చిన రెమ్యూనిరేషన్ కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్యనే.

ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు కోట్ చేసేసరికి మారు మాటాడకుండా బోయపాటి టీమ్ వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది. మరో నిర్మాత కూడా ఇలాగే ఎంక్వయిరీ చేసి, సైలంట్ అయినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద రాబిన్ హుడ్ టైపులో, సినిమాల మీద భారీగా తీసుకుని, జనాలకు పంచాలని అనుకుంటున్నాడేమో సోనూ?

ఎన్టీఆర్ ఆజ్ఞాతవాసం ఈ టోపీతోనే