ప్రభాస్ మూవీ కంటే కార్తికేయ సినిమా బెటర్

ఈరోజు ప్రభాస్ పేరును మరోసారి ట్రెండ్ చేయాలని రెడీగా కాచుక్కూర్చున్నారు అతడి అభిమానులు. సాహో సినిమా రేటింగ్ వస్తే ఆ నంబర్స్ తో సోషల్ మీడియాను వేడెక్కించాలని ఉవ్విళ్లూరారు. కానీ ప్రభాస్ అభిమానుల ఆశలపై…

ఈరోజు ప్రభాస్ పేరును మరోసారి ట్రెండ్ చేయాలని రెడీగా కాచుక్కూర్చున్నారు అతడి అభిమానులు. సాహో సినిమా రేటింగ్ వస్తే ఆ నంబర్స్ తో సోషల్ మీడియాను వేడెక్కించాలని ఉవ్విళ్లూరారు. కానీ ప్రభాస్ అభిమానుల ఆశలపై సాహో మరోసారి నీళ్లు చల్లింది. 

థియేటర్లలో ఆల్రెడీ ఫ్లాప్ అయిన ఈ సినిమా, స్మాల్ స్క్రీన్ పై కూడా దారుణంగా నిరాశ పరిచింది. సినిమా విడుదలైన ఇన్ని రోజులకు జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమైంది సాహో సినిమా. ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అవ్వడంతో రేటింగ్ దుమ్ముదులిపేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ  ఈ సినిమాకు అత్యల్పంగా 5.8 (ఏపీ+తెలంగాణ అర్బన్) టీఆర్పీ వచ్చింది.

ఓ పెద్ద సినిమాకు ఈ స్థాయిలో అతి తక్కువ రేటింగ్ రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు ఇలానే అత్యల్పంగా రేటింగ్ వచ్చింది. ఇప్పుడు సాహో, అజ్ఞాతవాసి సరసన చేరింది. విచిత్రమేంటంటే.. ఈ రెండు సినిమాల కథలు దాదాపు ఒకటే.

మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ వారం రేటింగ్స్ లో ప్రభాస్ సాహో సినిమా కంటే కార్తికేయ నటించిన గుణ సినిమాకు ఎక్కువ రేటింగ్ రావడం. ఈ సినిమాను కూడా ఫస్ట్ టైమ్ ఈటీవీలో ప్రసారం చేస్తే, సాహో కంటే కాస్త ఎక్కువగా రేటింగ్ వచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు టీవీల్లో ప్రసారమైన సరైనోడు సినిమా ఈ రెండు సినిమాలకు పోటీనిస్తూ మూడో స్థానంలో నిలవడం విశేషం.

అయితే రేటింగ్స్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇలా  భారీ అంచనాలతో వచ్చి బోల్తాపడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. మహేష్ నటించిన స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాలు.. రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ, చిరంజీవి ఖైదీ నంబర్ 150  సినిమాల్ని ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ చేసినప్పుడు ఇలానే అతి తక్కువ రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి సాహో కూడా చేరింది.

ఎన్టీఆర్ ఆజ్ఞాతవాసం ఈ టోపీతోనే