ఇప్పటికే ఆమె సినిమాలు థియేటర్లను మిస్ అవుతున్నాయి. వరుసగా ఓటీటీ వేదికలపైకి వచ్చేస్తున్నాయి. జాతీయ అవార్డు అందుకున్న క్రేజ్ కాస్తా పడిపోయింది. ఇలాంటి టైమ్ లో కీర్తిసురేష్ తీసుకున్న ఓ నిర్ణయం, ఆమె అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?
చిరంజీవి హీరోగా రాబోతున్న వేదాళం రీమేక్ లో కీర్తిసురేష్ నటించడానికి ఒప్పుకుంది. అందులో ఆమె చిరంజీవికి చెల్లెలిగా కనిపించబోతోంది. దాదాపు ఈ మేటర్ ఫిక్స్ అయింది. సరిగ్గా ఇక్కడే కీర్తిసురేష్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. చిరంజీవి సినిమాలో కీర్తిసురేష్ నటిస్తే రిస్క్ ఎలా అవుతుంది? దీనికి ఆమె ఫ్యాన్స్ చెబుతున్న లాజిక్ ఏంటో చూద్దాం.
చిరంజీవి సినిమాలో అతడికి చెల్లెలిగా నటించడమంటే, ఇక మెగా కాంపౌండ్ హీరోలందరికీ కీర్తిసురేష్ దూరమైనట్టే. భవిష్యత్తులో బన్నీ, చరణ్, పవన్ కల్యాణ్ లాంటి మెగా హీరోలు ఆమెను కన్సిడర్ చేయకపోవచ్చు. కీర్తిసురేష్ ఫ్యాన్స్ బయటకు తీసిన లాజిక్ ఇదే.
దీంతో పాటు మరో విషయాన్ని కూడా వాళ్లు సీరియస్ గా ప్రస్తావిస్తున్నారు. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో ఈ చెల్లెలి పాత్రలు అవసరమా అనేది వాళ్ల ప్రశ్న. ఇప్పటికే పెంగ్విన్ సినిమాతో కీర్తిసురేష్ సెలక్షన్ సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోయిందని.. ఇలాంటి టైమ్ లో చిరంజీవికి చెల్లెలు పాత్ర అంటే ఇక ఆమె టాలీవుడ్ ను మరిచిపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో కీర్తిసురేష్ ఫ్యాన్స్ సాగిస్తున్న చర్చలు ఇలా సాగుతున్నాయి. వాళ్లు లేవనెత్తుతున్న పాయింట్స్ లో లాజిక్ ఉంది. మరి కీర్తిసురేష్ ఏ లాజిక్ మీద ఇలాంటి సినిమాలు అంగీకరిస్తోందో ఆమెకే తెలియాలి.