ఆంధ్రలో మళ్లీ నైట్ కర్ఫ్యూ ?

కరోనా మూడో దశ వ్యాప్తి తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైంది. తెలంగాణ లో ఇప్పటికే మూడో దశ ఙోరుగా వుంది. ఆంధ్రలో ప్రస్తుతానికి ఆరంభంలోనే వుంది. అయితే నిన్నటి నుంచి ఆంధ్రలో కూడా కేసుల…

కరోనా మూడో దశ వ్యాప్తి తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైంది. తెలంగాణ లో ఇప్పటికే మూడో దశ ఙోరుగా వుంది. ఆంధ్రలో ప్రస్తుతానికి ఆరంభంలోనే వుంది. అయితే నిన్నటి నుంచి ఆంధ్రలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. విశాఖ ఙిల్లాలో 80 కేసుల వరకు వున్నాయని వార్తలు వినవస్తున్నాయి. అలాగే చిత్తూరు, కృష్ణా ఙిల్లాల్లో యాభైకి పైగా కేసులు వున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 8 నుంచి తెలంగాణలో సెలవులు మొదలవుతున్నాయి. అంటే ఆంధ్రకు సంక్రాంతి ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. వేల సంఖ్యలో ప్రఙలు ఆంధ్రకు తరలి వెళ్తారు. అలాగే బెంగుళూరు, చెన్నయ్ ల నుంచి కూడా ఙనాలు వస్తారు. కోడిపందాలు, సంక్రాంతి ఙాతరలు హడావుడే హడావుడి.

ఈ నేపథ్యంలో ముందస్తు ఙాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఙరిగితే సెకెండ్ షో మాయం అయిపోతుంది. ఇది కచ్చితంగా సంక్రాంతికి తామర తంపరగా విడుదలయ్యే సినిమాల మీద ప్రభావం చూపిస్తుంది.ఈ నెల 10 నాటికి ఆంధ్రలో నిబంధనల విషయంలో క్లారిటీ వస్తుందని రాఙధాని వర్గాల బోగట్టా.