తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య ముంబైలో లగ్జరీ ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో 9,000 చదరపు అడుగుల ప్లాట్ ను రూ.70 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు పిల్లలతో కలిసి చెన్నైలో ఉంటున్న సూర్య, జ్యోతిక దంపతులు త్వరలోనే ముంబైలోని కొత్త ప్లాట్ కి షిప్ట్ కానున్నట్లు సమాచారం. కాగా నటి నగ్మా సోదరి జ్యోతికను సూర్య వివాహం చేసుకున్నారు. వీరికి దియా మరియు దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా సూర్య ప్రస్తుతం సూర్య 42 వర్కింగ్ టైటిల్ తో శివ దర్శకత్వంలోని ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల నిర్మాతగా కూడా మంచి గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. 2021లో విడుదలైన జై భీమ్ సినిమాలో నటుడుగా, నిర్మాతగా మంచి పేరు సంపాధించుకున్నారు.