బోయపాటి సినిమా మరింత వెనక్కు

ఈ ఏడాది రాబోతున్న సినిమాల్లో మంచి బజ్, ఆసక్తి రేకెత్తిస్తున్న ది బోయపాటి-రామ్ కాంబినేషన్ సినిమా. చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న ఈ సినిమా చకచకా షూట్ అవుతోంది.  Advertisement కానీ ఎంత షూట్ అవుతున్నా…

ఈ ఏడాది రాబోతున్న సినిమాల్లో మంచి బజ్, ఆసక్తి రేకెత్తిస్తున్న ది బోయపాటి-రామ్ కాంబినేషన్ సినిమా. చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న ఈ సినిమా చకచకా షూట్ అవుతోంది. 

కానీ ఎంత షూట్ అవుతున్నా అంతకు అంతా వర్క్ వుంటూనే వుంది. బోయపాటి మేకింగ్ స్టయిల్ అంతే. ఈ సినిమా మే విడుదల అనుకున్నారు. తరువాత మరేం చెప్పలేదు. జూన్ వస్తుందనుకుంటున్నారు. కానీ ఇప్పుడు క్లారిటీ వస్తోంది జూన్ లో కూడా రాదని.

అయితే జూలైలో ఇస్మార్ట్ శంకర్ సెంటిమెంట్ తో రావడం లేదా ఆగస్ట్ లో విడుదల కావడం. మెగాస్టార్ భోళాశంకర్ సినిమా ఆగస్టు టార్గెట్ గా రెడీ అవుతోంది కనుక రామ్-బోయపాటి సినిమాకు మిగిలింది జూలై నే. ఇప్పటి వరకు ఇంకా ఈ సినిమా టైటిల్ బయటకు రాలేదు. బోయపాటి దృష్టి అంతా మేకింగ్ మీదే వుంది. అందువల్ల ఇప్పటికి ఇంకా ఫ్యాన్స్ వెయిటింగ్ లో వుండాల్సిందే.

ఈ సినిమా పూర్తి చేసి బాలయ్య సినిమా మీదకు వెళ్లాలి బోయపాటి. అయితే అక్కడ బాలయ్య కూడా దసరా వరకు అనిల్ రావిపూడి సినిమా మీదనే వుంటారు. అందువల్ల ఇద్దరికీ తొందర లేదు. సో, ఎంత చెక్కాలో అంతా చెక్కి మరీ వదులుతారు రామ్ సినిమాను బోయపాటి.