క‌మ్మోళ్ల వైతే గ‌ళం విప్పుతారు, బ‌య‌టోళ్ల వైతే కాళ్లు విర‌గ్గొట్టుకుంటారు!

గీతం భూముల వ్య‌వ‌హారంలో  సీపీఐ నారాయ‌ణ అలియాస్ చికెన్ నారాయ‌ణ తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ద‌శాబ్దాల నుంచి భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌టం అనేది క‌మ్యూనిస్టుల‌కు నిత్య‌కృత్యంగా ఉంటూ వ‌చ్చింది. Advertisement ప్రైవేట్…

గీతం భూముల వ్య‌వ‌హారంలో  సీపీఐ నారాయ‌ణ అలియాస్ చికెన్ నారాయ‌ణ తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ద‌శాబ్దాల నుంచి భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌టం అనేది క‌మ్యూనిస్టుల‌కు నిత్య‌కృత్యంగా ఉంటూ వ‌చ్చింది.

ప్రైవేట్ వ్య‌క్తులు చేసే భూ దోపిడీల‌ను గుర్తించి, వాటిని ఎండ‌గ‌ట్ట‌డం, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డం, వీలైతే ప్ర‌జ‌ల‌ను తీసుకెళ్లి అక్క‌డ జెండాలు పాత‌డం కూడా క‌మ్యూనిస్టులు చేస్తూ ఉంటారు. అయితే పాతిన ఆ జెండాల‌ను తిరిగి ఆక్ర‌మ‌ణ దారులు తొల‌గిస్తూ ఉంటారు. 

అనంత‌పురం జిల్లాలో ఒక ట్ర‌స్టుభూముల‌ను ఒక రెడ్డిగారు కొంటే ఆయ‌న‌ను క‌మ్యూనిస్టు పార్టీలు మామూలుగా ఏడిపించ‌లేదు! ఆ ట్ర‌స్టు వాళ్లు ఎప్పుడో బ్రిటీష‌ర్ల టైమ్ లో భూములు కొన్నార‌క్క‌డ‌. కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత వాళ్ల కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి. అదే అదునుగా చూసి కొంత‌మంది వ్య‌క్తులు ఆ ట్ర‌స్టు భూముల‌ను ఆక్ర‌మించారు.

కొంద‌రు ఘ‌నులు ఇళ్లు కూడా క‌ట్టుకున్నారు! వాస్త‌వానికి అది ఒక ప్రైవేట్ ట్ర‌స్టు భూమి. ఆ ట్ర‌స్టులో గ‌తంలో వాచ్ మెన్లుగా స‌హాయ‌కులుగా ఉద్యోగాలు చేసిన వాళ్లంతా ఆ సంస్థ కార్య‌క‌లాపాలు ఆగిపోగానే అక్క‌డ పాక‌లేశారు. బ‌య‌టి వాళ్లు కూడా అదును చూసి పునాదులు వేసి ఇళ్లు క‌ట్టుకున్నారు.

త‌మ భూమి అలా అన్య‌క్రాంతం అవుతుంటే ఇక చేసేది లేక ఆ రిజిస్ట‌ర్డ్ భూమిని ఒక స్థానిక రెడ్డిగారికి క‌ట్ట‌బెట్టింది ఆ సంస్థ‌. ఆయ‌న అఫిషియ‌ల్ గా కొన్నారు. రిజిస్ట‌ర్ కూడా జ‌రిగింది. అయితే అప్ప‌టికే పాక‌లేసిన వాళ్లు, పునాదులు వేసిన వారు తాము ద‌శాబ్దాల నుంచి ఉంటున్నామంటూ ఆ భూమి త‌మ‌దంటూ మొద‌లుపెట్టారు. వారితో క‌మ్యూనిస్టులు కూడారు.

ఆ భూమిని కొన్న వ్య‌క్తి దాదాపు ప‌దేళ్ల పాటు కోర్టు చుట్టూ తిరిగాడు. చివ‌ర‌కు కోర్టు అత‌డికే అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎందుకంటే అదేమీ అసైన్డ్ ల్యాండ్ కాదు, ప‌ట్ట‌బాభూమి. అధికారికంగా రిజిస్ట‌ర్ ఆఫీసులో కొన్న‌ట్టుగా రిజిస్ట‌ర్ కూడా చేయించుకున్నారు. ట్ర‌స్టు వాళ్లు కామ్ గా ఉన్న‌ప్పుడు ఆక్ర‌మించుకున్న వాళ్లంతా అడ్డం తిరిగితే భూమి వాళ్లైదైపోదు క‌దా!

చ‌ట్ట‌ప్ర‌కారం ఆ వ్య‌క్తి ఆ భూమిపై హ‌క్కులు సంపాదించినా క‌మ్యూనిస్టుల కంపు మాత్రం వ‌ద‌ల్లేదు. చివ‌ర‌కు అప్ప‌ట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేత‌ల‌కు త‌లా ఒక బ్యాగు నిండా క్యాష్ పంపి, క‌మ్యూనిస్టుల‌ను స‌ముదాయించాల్సి వ‌చ్చింద‌ట స‌ద‌రు కాంగ్రెస్ మూలాలున్న వ్య‌క్తి. అందులో క‌మ్యూనిస్టులు వాటాలెంతో కానీ.. టీడీపీ నేత‌ల‌కు బ్యాగులు అందాకా క‌మ్యూనిస్టులు ఆ వ్య‌వ‌హారం నుంచి దూరం జ‌రిగారు. ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు లేకుండా పోయాయి.

ఇవీ క‌మ్యూనిస్టు మార్కు ఉద్య‌మాలు. ఈ మ‌ధ్య‌నే చికెన్ నారాయ‌ణ గారు ఒక చోట భూ ఆక్ర‌మ‌ణ‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. ఎలాగో తెలుసా?  వారు క‌ట్టుకున్న గోడ‌ను కాలితో త‌న్ని ధ్వంసం చేసే ప్ర‌య‌త్నం చేశారు. సినిమాల్లో హీరో క‌దా లేచిన‌ట్టుగా వెళ్లి ఒంటికాలితో త‌న్ని దాన్ని కూల్చారు!

అస‌లు అది ఆక్ర‌మ‌ణే అనుకుందాం.. అలా అని చెప్పి దాన్ని కూల్చే హ‌క్కు నారాయ‌ణ‌కేముంది? ఈయ‌న ఏమైనా ఆ ఏరియా రెవెన్యూ ఇన్స్పెక్ట‌రా?  లేక మ‌రో ప్ర‌భుత్వ ఉద్యోగా? ప‌్ర‌భుత్వం ఆక్ర‌మ‌ణ భూమిలో అర్ధ‌రాత్రి కూల్చ‌కూడదు… అని సుద్దులు చెబుతున్న పెద్ద మ‌నిషి త‌న‌కేం హ‌క్కుంద‌ని వెళ్లి కాలితో త‌న్ని గోడ‌ను కూల్చి త‌న కాలే విర‌గొట్టుకున్న‌ట్టు?  వేరే వాళ్ల భూముల అయితే కాళ్లు లేపి విర‌గొట్టుకుంటారు, త‌మ సాటి క‌మ్మ వాళ్లు ఆక్ర‌మిస్తే.. మాత్రం ఎక్క‌డ‌లేని నీతులు చెబుతున్నారు! ఇది మార్క్స్ చెప్పిన  క‌మ్యూనిజం? మ‌రే లెనిన్ ఆచ‌రించిన వామ‌ప‌క్ష వాదం కామ్రేడ్?

జనసైనికులకు మాత్రం పండగే