థియేటర్లు సీజ్ చేయలా? వద్దా?

ఆంధ్రలో ఫైర్ సేప్టీ లేని థియేటర్లు సీజ్ చేస్తే బుర్ర తక్కువ నాయకులు చాలా మంది అదేదో కక్ష సాధింపు అంటూ నానా యాగీచేసారు. ఆఖరికి జనాలు మరిచిపోయిన, మరిచిపోతున్న కమ్యూనిస్ట్ నారాయణ లాంటి…

ఆంధ్రలో ఫైర్ సేప్టీ లేని థియేటర్లు సీజ్ చేస్తే బుర్ర తక్కువ నాయకులు చాలా మంది అదేదో కక్ష సాధింపు అంటూ నానా యాగీచేసారు. ఆఖరికి జనాలు మరిచిపోయిన, మరిచిపోతున్న కమ్యూనిస్ట్ నారాయణ లాంటి వాళ్లు కూడా తామూ వున్నాము అంటూ ఓ స్టేట్ మెంట్ పడేసారు. 

ఇటీవల మంత్రి పేర్ని నాని సీజ్ చేసిన థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూ, ఫీజులు కట్టడానికి నెల రోజులు గడువు ఇచ్చారు. అదే టైమ్ లో ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేని థియేటర్లు తెరవడానికి మాత్రం అనుమతి ఇవ్వడానికి సమస్యలు ఎదురయ్యాయి. 

అధికారికంగా ప్రభుత్వం ఇలా ఆదేశాలు ఇవ్వలేదు. అలా ఇస్తే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. 

అందుకే మౌఖిక ఆదేశాలే తప్ప లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వగలిగే పరిస్థితి లేదు. ఇదిలా వుంటే హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ థియేటర్ అగ్నికి ఆహుతి అయిపోయింది. అదృష్టం కొద్దీ సినిమా ప్రదర్శన టైమ్ లో జరగలేదు. 

ఫైర్ సేఫ్టీ లేని థియేటర్లను ఆంధ్రలో ఇన్నాళ్లుగా చూసీ చూడనట్లు వదిలేసారు. నిజానికి ఈ విషయంలో థియేటర్లు సీజ్ చేయడం కాదు, సంబంధిత అధికారులను బోన్లో నిల్లో పెట్టాలి. అప్పుడు కానీ థియేటర్ల అవినీతికి అడ్డుకట్ట పడదు. 

కానీ అలాంటి థియేటర్లను సీజ్ చేస్తుంటే బుర్ర తక్కువ నాయకులు అంతా కిందా మీదా అయిపోతున్నారు. వీళ్లకు జనాల ప్రాణాలు లెక్క లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప.