ఆది కి కూడా ఆలస్యం అలవాటైందా?

హీరో అనగానే టైమ్ కు రాకూడదు అని ఏమన్నా రాజ్యాంగం ఫిక్స్ చేసుకున్నారో ఏమిటో? మీటింగ్ లు, ఫంక్షన్ లు, ప్రెస్ మీట్ లు దేనికీ టైమ్ కు రారు. తీరా వచ్చిన తరువాత…

హీరో అనగానే టైమ్ కు రాకూడదు అని ఏమన్నా రాజ్యాంగం ఫిక్స్ చేసుకున్నారో ఏమిటో? మీటింగ్ లు, ఫంక్షన్ లు, ప్రెస్ మీట్ లు దేనికీ టైమ్ కు రారు. తీరా వచ్చిన తరువాత సారీ చెబుతారు. అది కూడా అప్పుడప్పుడు సెటైర్ లు వేస్తుంటారు. పీఆర్ టీమ్ మీద నెపం తోసేస్తుంటారు.

ఈ జాబితాలో స్మాల్ హీరో ఆది సాయి కుమార్ కూడా చేరిపోయాడు. ఇంటర్వూలు అంటే ఏకంగా గంట ఆలస్యంగా వచ్చేసాడు. ఆది సాయి కుమార్ నటించిన అతిథి దేవో భవ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. అసలు అదో సినిమా వుందనే చాలా మందికి తెలియదు. అలాంటిది ప్రమోషన్లు బాగా చేసుకుని, సినిమాను కాస్త జనాల్లోకి తీసుకెళ్లాలి. 

కానీ ఆది సాయికుమార్ ప్రమోషన్ల తొలి రోజే గంటకు పైగా ఆలస్యంగా వచ్చాడు. ఇంటర్వూలు ఫిక్స్ చేసుకున్నవారు ఇక తట్టా బుట్టా సర్దేసుకుని వెళ్లిపోదాం అనుకునే టైమ్ కు హీరోగారు తీరిగ్గా వచ్చారు. వచ్చిన తరువాత ఏదో కారణం చెప్పడం మామూలే కదా. 

పెద్ద హీరోలు అలాగే చేసి, హిట్ కోసం ఎదురుచూసే చిన్న హీరోలు అలాగే చేస్తే ఇక డిసిప్లిన్ అనే మాటకు అర్థం వుండదేమో?