దసరా..నానికి కొత్త రికార్డు ఇస్తుందా?

వళ్లు గుల్ల చేసుకుని మరీ ప్రచారం చేస్తున్నాడు హీరో నాని తన దసరా సినిమా కోసం. సౌత్..నార్త్ అస్సలు గ్యాప్ లేకుండా తిరుగుతున్నాడు. అడగనివారిదే పాపం..ఇంటర్వూలకు నో అనడం లేదు. పిలవని వారిదే పాపం..వెళ్లని…

వళ్లు గుల్ల చేసుకుని మరీ ప్రచారం చేస్తున్నాడు హీరో నాని తన దసరా సినిమా కోసం. సౌత్..నార్త్ అస్సలు గ్యాప్ లేకుండా తిరుగుతున్నాడు. అడగనివారిదే పాపం..ఇంటర్వూలకు నో అనడం లేదు. పిలవని వారిదే పాపం..వెళ్లని టీవీ షో లేదు. ఇక రీల్స్, వీడియోలు లెక్క జ‌మా లేదు. దానికి తగినట్లే సినిమాకు మాంచి బజ్ వచ్చింది. 

పైగా ఇటీవల నెల రోజులుగా ఒక్క సరైన మాస్ సినిమా థియేటర్లలో లేదు. సమ్మర్ ప్రారంభంలో రావడం మరో అడ్వాంటేజ్. ఇన్ని అడ్వాంటేజ్ లతో వస్తోంది దసరా సినిమా. అందువల్ల ఏ రేంజ్ ఓపెనింగ్ అందుకుంటుంది అన్నది పాయింట్.

ఇప్పటి వరకు నానికి వున్న ఓపెనింగ్ రికార్డు ఎంసిఎ సినిమానే. ఆ తరువాత ఇంత వరకు మళ్లీ అదే రేంజ్ ఓపెనింగ్ రాలేదు. ఆ సినిమాకు దాదాపు ఏడు కోట్ల రేంజ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఇప్పుడు దసరా సినిమా ఆ రికార్డును తిరగరాస్తుందా? ఎందుకంటే నానికి ఇటీవల కాలంలో ఇంత బజ్ తీసుకువచ్చిన సినిమా మరోటి లేదు. శ్యామ్ సింగ రాయ్ విడుదల తరువాత అందుకుంది కానీ ముందు కాదు.

పైగా దసరా సినిమా టాలీవుడ్ కు కీలకమైన నైజాంలో మంచి ఓపెనింగ్ తీసుకునే అవకాశం పక్కాగా వుంది. సెన్సారు సర్టిఫికెట్ వచ్చేసింది కనుక మల్టీ ఫ్లెక్స్ లు కూడా ఇక బుకింగ్ లు కాస్త ముందుగానే ఓపెన్ చేసే చాన్స్ వుంది. అందువల్ల అన్నీ బాగుంటే మంచి ఓపెనింగ్ తీసుకుని నానికి కొత్త రికార్డు ఇస్తుందేమో చూడాలి.