మెగా ఇంట్లో మరో డివోర్స్?

మెగా ఫ్యామిలీని ఏదో శాపం వెన్నడుతున్నట్లుంది. వివాహాలు నిలవడం లేదు. చిరు ఇంట్లో సమస్య తెలిసిందే. పవన్ వ్యవహారాలు కూడా తెలిసినవే. ఇప్పుడు నాగబాబు ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతోందని గ్యాసిప్ లు…

మెగా ఫ్యామిలీని ఏదో శాపం వెన్నడుతున్నట్లుంది. వివాహాలు నిలవడం లేదు. చిరు ఇంట్లో సమస్య తెలిసిందే. పవన్ వ్యవహారాలు కూడా తెలిసినవే. ఇప్పుడు నాగబాబు ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతోందని గ్యాసిప్ లు గుప్పుమంటున్నాయి. 

నాగబాబు కుమార్తె నిహారిక అల్లుడు చైతన్యల మధ్య ఏదో జ‌రుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇది కొత్త కాదు చాలా కాలంగా కొద్ది కొద్దిగా వినిపిస్తున్నదే. ఇటీవల నీహారిక చాలా సైలంట్ అయిపోయారు. అస్సలు సోషల్ మీడియాలో హడావుడి కూడా లేదు. మెగా ఫ్యామిలీ ఫొటోల్లో చైతన్య కనిపించడం లేదు.

లేటెస్ట్ గా వినిపిస్తున్నది ఏమిటంటే ఈ ఇద్దరు సోషల్ మీడియా అక్కౌంట్లలో ఒకరిని మరొకరు ఫాలో కావడం లేదని. చైతన్య తన అక్కౌంట్ లోంచి పాత ఫొటొలు చాలా డిలీట్ చేసారని. 

ఏదో క్లారిటీ రాకుండా ఓ నిర్ణయానికి రాలేము. బట్ సమ్ థింగ్..సమ్ థింగ్ అని అనుకోవాల్సి వస్తోంది. నాగబాబు ఈ ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి చేయాలనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారని చిరకాలంగా వినిపిస్తోంది. వాటిని ఎవరూ అంగీకరించనూ లేదు. ఖండించనూ లేదు. మొత్తానికి మెగా బ్రదర్ ఫ్యామిలీలో చిన్న డిస్ట్రబెన్స్ అయితే వుందని బలంగా వినిపిస్తోంది. నిజానిజాలు కొన్నాళ్ల తరువాత కానీ బయటకు రాకపోవచ్చు.

2 Replies to “మెగా ఇంట్లో మరో డివోర్స్?”

Comments are closed.