‘నాకు మహేష్ బాబే కావాలి’

ఏ కొత్త హీరోయిన్ అయినా టాప్ లైన్ హీరోల చెంతనే నటించాలని కోరుకోవడం సహజం. అలాంటి తొలి సినిమాతోనే క్రేజ్ వస్తే ఇంక ఆగుతారా? సమస్యలేదు. టార్గెట్ మహేష్ బాబునే. Advertisement పెళ్లి సందడి…

ఏ కొత్త హీరోయిన్ అయినా టాప్ లైన్ హీరోల చెంతనే నటించాలని కోరుకోవడం సహజం. అలాంటి తొలి సినిమాతోనే క్రేజ్ వస్తే ఇంక ఆగుతారా? సమస్యలేదు. టార్గెట్ మహేష్ బాబునే.

పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో వచ్చి యూ ట్యూబ్ ను ఊపు ఊపేసింది శ్రీలీల అనే కొత్త హీరోయిన్. తెలుగు అమ్మాయే. కానీ బెంగుళూరు నుంచి దిగుమతి అయింది. మన దగ్గుబాటి వారికి దూరపు చుట్టాలు అని టాక్ కూడా వుంది. అదంతా అలా వుంచితే పెళ్లి సందడి సినిమాలో ఆ అమ్మాయి డ్యాన్స్ లు, హావభావాలు అన్నీ చూపి యూ ట్యూబ్ వ్యూవర్స్ అంతా మిలియన్ల కొద్దీ వ్యూస్ కట్టబెట్టారు.

పెళ్లిసందడి తరువాత సినిమా రవితేజ సరసన చేస్తోంది శ్రీలీల. ఆ తరువాత సినిమా ఏదీ ఇంకా కమిట్ కాలేదు. బట్ ఎవరైనా అప్రోచ్ అయితే మాత్రం మహేష్ బాబు హీరో అయితే చేస్తా అంటోదట. తొలి సినిమా శ్రీకాంత్ తనయుడు రోషన్. మలి సినిమా రవితేజ. ముచ్చటగా మూడో సినిమా మహేష్ బాబు అన్నమాట. 

అంటే కెరీర్ మీద అమ్మడు ఫుల్ క్లారిటీగానే వుందన్నమాట. సరే, శ్రీలీలకు మహేష్ సరసన నటించాలని వుండొచ్చు. కానీ మహేష్ కు కూడా వుండాలిగా. అంతా ఓకె అయితే త్రివిక్రమ్ -మహేష్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా దర్శనం ఇస్తుందేమో?