సంక్రాంతికి ‘హీరో’

ఈసారి సంక్రాంతి భలే చిత్రంగా ఉండబోతోంది. సాధారణంగా భారీ సినిమాలు సంక్రాంతికి వస్తాయి. కానీ ఈసారి కుర్ర హీరోలంతా సంక్రాంతికి తమ లక్ పరీక్షించుకోబోతున్నారు.  Advertisement యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, కొత్తగా హీరోలు…

ఈసారి సంక్రాంతి భలే చిత్రంగా ఉండబోతోంది. సాధారణంగా భారీ సినిమాలు సంక్రాంతికి వస్తాయి. కానీ ఈసారి కుర్ర హీరోలంతా సంక్రాంతికి తమ లక్ పరీక్షించుకోబోతున్నారు. 

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, కొత్తగా హీరోలు గా పరిచయం అవుతున్న ఆశిష్ రెడ్డి (రౌడీ బాయిస్), గల్లా అశోక్ (హీరో), ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్ (సూపర్ మచ్చి), అలాగే ఎమ్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ (7డేస్ 6 నైట్స్) సినిమాలు అన్నీ సంక్రాంతికే రాబోతున్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు అయిన గల్లా అశోక్ నటించిన సినిమా హీరో. గతంలో కొన్ని మంచి సినిమాలు అందించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. మంచి ప్రాజెక్టుతో తెరపైకి రావాలని చాలా ఏళ్లుగా గల్లా అశోక్ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఫైనల్ అయిన ప్రాజెక్టు హీరో. 

ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి, అన్ని సినిమాల మధ్య దింపడం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త ఎక్కువ వున్నట్లే. ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమాను కాస్త గట్టిగా విడుదల చేస్తున్నారు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.