గ్రాఫిక్స్ తో వచ్చిన అవార్డులు కాదమ్మా… ?

అవార్డులు అంటేనే అదో రకమైన అనుమానం చూపులు, ఎన్నో సందేహాలు ఉన్న కాలమిది. ఇక పాలనలో సైతం గ్రాఫిక్స్ తో మిక్స్ చేసి గత పాలకులు ఎన్నో వింతలు చూపించారన్న విమర్శలు ఎటూ బాగానే …

అవార్డులు అంటేనే అదో రకమైన అనుమానం చూపులు, ఎన్నో సందేహాలు ఉన్న కాలమిది. ఇక పాలనలో సైతం గ్రాఫిక్స్ తో మిక్స్ చేసి గత పాలకులు ఎన్నో వింతలు చూపించారన్న విమర్శలు ఎటూ బాగానే  ఉన్నాయి.

దాంతో అవార్డు వచ్చింది అంటే దాని వెనకాల కధ కూడా చెప్పాల్సి వస్తోంది. ఒక వైపు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెడుతూనే మరో వైపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నాయకత్వం విధానాలను చాలా తెలివిగా ఎండగట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ.

గత ఏడాది పురపాలక విభాగంలో పనితీరుకు గానూ రాష్ట్రానికి పది అవార్డులు వచ్చాయని బొత్స చెప్పారు. అదే సమయంలో కేంద్ర అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి అన్నీ చూసి ఇచ్చిన అవార్డులు ఇవి అని చెప్పుకున్నారు.

గ్రాఫిక్స్ తో ట్రిక్స్ తో వచ్చిన అవార్డు కావని ఆయన నాటి టీడీపీ సర్కార్ పెద్దలకు పరోక్షంగా చురకలు  అంటించారు. ఏపీ సర్కార్ ఎంతో కృషి చేసి పని చేస్తే ఇవి దక్కాయని అన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని అన్నారు.

మొత్తానికి చూస్తే గ్రాఫిక్స్ గారడీలు అంటూ బాగానే టీడీపీని ఆయన టార్గెట్ చేశారనుకోవాలి. మరి ఏపీని దేశంలోనే అన్ని విధాలుగా టాప్ లెవెల్ లో నిలబెడతామని చెబుతున్న బొత్స మునిసిపాలిటీలలో చెత్త రహితంగా సుందరమైన సీమలను సృష్టిస్తామని చెప్పడం కూడా విశేషంగా చూడాలి.