సంక్రాంతి బరిలోకి రాజుగారు

చాలా ఏళ్ల క్రితం సంక్రాంతి బరిలోకి కచ్చితంగా సుమంత్ ఆర్ట్స్ సినిమాలు వచ్చేవి. నిర్మాత ఎమ్ ఎస్ రాజు భారీ సినిమాలు నిర్మించి సంక్రాంతి బరిలోకి దింపేవారు. సరే ఓడలు బళ్లు కావడం చిత్రం…

చాలా ఏళ్ల క్రితం సంక్రాంతి బరిలోకి కచ్చితంగా సుమంత్ ఆర్ట్స్ సినిమాలు వచ్చేవి. నిర్మాత ఎమ్ ఎస్ రాజు భారీ సినిమాలు నిర్మించి సంక్రాంతి బరిలోకి దింపేవారు. సరే ఓడలు బళ్లు కావడం చిత్రం కాదు. ఎమ్ ఎస్ రాజు భారీ సినిమాల నిర్మాణాన్ని పక్కన పెట్టారు. ఆయన డైరక్షన్ లోనే చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు.

అలా నిర్మించిన చిన్న సినిమా 7 డేస్ 6 నైట్స్. గతంలో 'డర్టీ హరి' లాంటి ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ తరువాత అందిస్తున్న  '7 డేస్ 6 నైట్స్' తో సంక్రాంతి రిలీజ్ బరిలో దిగనున్నారు. 

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నాకు నచ్చేలా అందరూ మెచ్చేలా ఈసారి ఒక న్యూ జెన్ రోమ్-కామ్ చిత్రంతో అన్ని రకాల ప్రేక్షకులని అలరించబోతున్నాం. బాచిలర్ ట్రిప్ కోసం గోవా కి వెళ్లిన 2 యువకులు, 2 యువతుల చుట్టూ జరిగే కథ ఇది. క్లాసిక్ చిత్రంగా మారే అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రతీ ఒక్కరు, తమని తాము ఇందులోని పాత్రలకి బాగా రిలేట్ చేసుకుంటారు. సంక్రాంతి కి రానున్న ఈ చిత్రం, అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం” అని అన్నారు.