ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న వస్తున్నపుడు రాజమౌళి ఓ ట్వీట్ వేసారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు కొందరికి థాంక్స్ చెప్పారు. అలా వేసిన ట్వీట్లలో సర్కారువారి పాట పై కూడా వుంది. వీర త్యాగం చేసారు అన్నంతగా రాజమౌళి ట్వీట్ వేసారు. కానీ త్యాగం చేసింది సర్కారువారి పాట కాదు. అసలు ఆ సినిమా సంక్రాంతి బరిలోంచి తప్పుకుని ఏప్రిల్ 1 కి ఎప్పుడో వెళ్లిపోయింది. అయినా రాజమౌళి థాంక్స్ చెప్పారు. అది వేరే విషయం.
ఈ సంగతి అలా వుంచితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే సర్కారు వారి పాట ప్లేస్ లో ఏప్రిల్ 1 తేదీకి ఆర్ఆర్ఆర్ వస్తుంది అన్నది. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ ను కాస్త కలవరపెడుతోంది. ఏప్రిల్ 1 డేట్ వదిలేస్తే మరి కాస్త వెనక్కు వెళ్లాల్సి వుంటుంది.
నిజానికి సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా కనీసం నలభై రోజులు పెండింగ్ లో వుందని తెలుస్తోంది. అందులో ముఫై రోజులు హీరో పార్ట్ నే అని కూడా వినిపిస్తోంది. నాన్ స్టాప్ గా హీరో పార్ట్ షూట్ చేయడం కష్టమే. అందువల్ల ఎంత కాదన్నా మార్చి వరకు షూట్ వుండే అవకాశం వుందని తెలుస్తోంది. అదీకాక దర్శకుడు పరుశురామ్ స్క్రిప్ట్ ను కొంత మేరకు ఫైన్ ట్యూన్ చేస్తున్నారని కూడా టాక్ వుంది.
ఇవన్నీ చూసుకుంటే ఆర్ఆర్ఆర్ కు ఏప్రిల్ 1 డేట్ ను త్యాగం చేసేటట్లే కనిపిస్తోంది. మరి ఇంతకీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మరి?