చిరంజీవిని చూసి నోరెళ్లబెట్టిన దర్శకుడు

చిరంజీవి ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నారు. ఇటు గాడ్ ఫాదర్ సినిమా చేస్తూనే, మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరి వీటిలో ఏ సినిమా ఎంత వరకు వచ్చింది.…

చిరంజీవి ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నారు. ఇటు గాడ్ ఫాదర్ సినిమా చేస్తూనే, మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరి వీటిలో ఏ సినిమా ఎంత వరకు వచ్చింది. వీటిలో గాడ్ ఫాదర్ షూటింగ్ కు సంబంధించి ఆ సినిమా దర్శకుడు మోహన్ రాజా అప్ డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి గాడ్ ఫాదర్ కంప్లీట్ చేస్తామంటున్నాడు ఈ దర్శకుడు.

“దాదాపు చిరంజీవి సోలో వర్క్ మొత్తం పూర్తిచేశాం. 2 ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. ఇప్పటివరకు 45 రోజులు షూట్ చేశాం. దాదాపు 45శాతం షూటింగ్ పూర్తయినట్టే. జనవరిలో కొత్త షెడ్యూల్ ఉంది. దాదాపు జనవరి మొత్తం షూట్ పెట్టుకున్నాం. ఈ నెలలోనే టాకీ మొత్తం పూర్తిచేస్తాం. ఫిబ్రవరిలో 2 సాంగ్స్, క్లైమాక్స్ తీయాలనుకుంటున్నాం.”

ఇలా గాడ్ ఫాదర్ షెడ్యూల్ వివరాలు బయటపెట్టాడు మోహన్ రాజా. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న ఈ దర్శకుడు.. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు కథలో చాలా మార్పులు చేశామంటున్నాడు.

“లూసిఫర్ కథను బేస్ గా మాత్రమే తీసుకున్నాం. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు చాలా మార్పులు చేశాం. ఆయనతో పనిచేయడం ఒక్కో రోజు ఒక్కో అనుభూతి. కొన్నిసార్లు ఆయన నటిస్తుంటే, నేను కట్ చెప్పడం మరిచిపోతున్నాను. అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోతున్నాను. గాడ్ ఫాదర్ పాత్ర అంత బాగా వస్తోంది. చిరంజీవి మేనరిజమ్స్, స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.”

మలయాళంలో లూసిఫర్ సినిమాను చూసేసిన వాళ్లకు కూడా గాడ్ ఫాదర్ నచ్చుతుందని చెబుతున్నాడు మోహన్ రాజా. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.