టాలీవుడ్ సినిమాలు.. లీకులే లీకులు

టాలీవుడ్ ను మరోసారి లీకులు ఊపేస్తున్నాయి. ఒకేసారి 3 పెద్ద సినిమాలు లీక్స్ మూలంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ నుంచి మేకింగ్ వీడియోస్ తో పాటు, సెట్…

టాలీవుడ్ ను మరోసారి లీకులు ఊపేస్తున్నాయి. ఒకేసారి 3 పెద్ద సినిమాలు లీక్స్ మూలంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ నుంచి మేకింగ్ వీడియోస్ తో పాటు, సెట్ స్టిల్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గేమ్ ఛేంజర్ వంతు వచ్చింది.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఊహించని విధంగా ఈ సినిమా నుంచి ఓ ఆడియో సాంగ్ లీక్ అయింది. మొత్తం కాకపోయినా, పాట ప్రారంభం నుంచి పల్లవి వరకు బయటకు వచ్చేసింది. దీనిపై వెంటనే చర్యలకు దిగింది యూనిట్. తమ సినిమా కంటెంట్ ను లీక్ చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన యూనిట్.. సదరు సాంగ్ ను వ్యాప్తి చేసే వ్యక్తులపై కూడా చర్యలు తప్పవని, దయచేసి అందరూ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు అది పూర్తి క్వాలిటీ సాంగ్ కాదని కూడా స్పష్టం చేసింది. ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉందని, అంతలోనే రఫ్ వెర్షన్ లీక్ అయిందని అంటున్నారు యూనిట్ సభ్యులు.

ఊహించని విధంగా ప్రభాస్ సినిమా కూడా లీకుల బారిన పడింది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన క్లిప్ అది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ మాళవిక మోహనన్ పై ఓ చిన్న యాక్షన్ బ్లాక్ పిక్చరైజ్ చేశారు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వెంటనే అప్రమత్తమైన పీపుల్ మీడియా, ఆ క్లిప్పింగ్స్ ను తొలిగించింది.

ఇలా మినిమం గ్యాప్ లో పుష్ప-2 నుంచి ప్రభాస్ సినిమా వరకు క్రేజీ ప్రాజెక్టులు లీకుల బారిన పడడం, టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. వీటిని అరికట్టడంపై పెద్ద సినిమా నిర్మాతలంతా మరోసారి దృష్టిపెట్టారు.