ప్ర‌భాస్ కొత్త టైటిల్ వెదుక్కోవాల్సిందే ఇక‌!

ఒకేసారి మేకింగ్ ద‌శ‌లో ఉన్న రెండు సినిమాల విష‌యంలో ఒకే టైటిల్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం కొత్త ఏమీ కాదు. వాటి వ‌ర్కింగ్ టైటిలో లేక ప్రేక్ష‌కుల్లోకి వెళ్లిపోయిన టైటిలో ఒక‌టి ఉంటుంది. అయితే ఆ…

ఒకేసారి మేకింగ్ ద‌శ‌లో ఉన్న రెండు సినిమాల విష‌యంలో ఒకే టైటిల్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం కొత్త ఏమీ కాదు. వాటి వ‌ర్కింగ్ టైటిలో లేక ప్రేక్ష‌కుల్లోకి వెళ్లిపోయిన టైటిలో ఒక‌టి ఉంటుంది. అయితే ఆ టైటిల్స్ విష‌యంలో వివాదాలు ఎదుర‌వుతూ ఉంటాయి. ఒకే స‌మ‌యంలో నిర్మాణం అయ్యే రెండు ప్ర‌ముఖ సినిమాలు కూడా టైటిల్ విష‌యంలో పోట్లాడుకున్న దాఖ‌లాలున్నాయి.

ఇక ఒక సినిమాకు అనుకున్న వ‌ర్కింగ్ టైటిల్ మ‌రో సినిమాకు అస‌లు టైటిల్ అవుతుంటుంది కూడా! ఇలాంటి క్ర‌మంలో ప్ర‌భాస్ సినిమాకు ప్ర‌చారంలో ఉన్న ఒక టైటిల్ ను ఇప్పుడు మ‌రో సినిమా సొంతం చేసుకుంది. ప్ర‌భాస్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమాకు జాను అనే టైటిల్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు ఆ సినిమా గురించి చ‌ర్చ సాగుతూ వ‌చ్చింది. ప్రేక్ష‌కుల లెక్క‌లో ఆ సినిమా టైటిల్ అదే అన్న‌ట్టుగా ఫిక్స‌య్యింది.

టైటిల్ 'జాన్' గా కూడా ప్ర‌చారం పొందింది. అది ప్రేక్ష‌కుల్లో 'జాను'గా కూడా ప్ర‌చారం పొందింది. ఇప్పుడు జాను అనే టైటిల్ తో సినిమా వ‌స్తోంది.  ఆ టైటిల్ ఇప్పుడు మ‌రోసినిమాకు మారింది. త‌మిళ సినిమా 96 రీమేక్ కు జాను టైటిల్ ఖ‌రారు అయ్యింది. ఈ రీమేక్ సినిమాకు కూడా ప‌లు టైటిళ్లు వినిపించాయి. అయితే చివ‌ర‌కు జాను అనే టైటిల్ ను అధికారికంగా ప్ర‌క‌టించేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ సినిమాకు జాను టైటిల్ అవ‌కాశం లేన‌ట్టే. 'జాన్' అనే టైటిల్ కూడా వెంట‌నే వాడుకోవ‌డం అంత బాగుండ‌క‌పోవ‌చ్చు! ఆ సినిమా రూప‌క‌ర్త‌లు మ‌రో టైటిల్ ను వెదుక్కోవ‌ల్సిందే ఇక‌!

రష్మిక ఉతికి ఆరేసింది