జనసేనాని పవన్ కల్యాణ్‌కు కామన్ మ్యాన్ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు. రాజధాని విషయమై ఆయన మంగళవారం ట్వీట్ చేసిన నేపథ్యమే ఈ ప్రశ్నల ఉత్పన్నానికి కారణమైంది.
విశాఖపట్నం వాసులు పాలనా రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏ విషయంలో విశాఖవాసులు సంతృప్తిగా లేరో వివరణ ఇస్తారా? ఉత్తరాంధ్ర, రాయలసీమ వద్దనుకుంటున్నపాలనా రాజధానిని అమరావతి వాసులు మాత్రం ఎందుకు కోరుకుంటున్నారు.
అలాగే రోజుల తరబడి వారంతా ఎందుకు రోడ్డుమీదికి వచ్చి అందోళన చేయాల్సి వస్తోంది? వారికి టీడీపీ, వామపక్షాలు, మీతో సహా సంఘీభావం ఎందుకు ప్రకటించారు? అమరావతి వాసులతో పాటు టీడీపీ, జనసేన, వామపక్షాలు, బీజేపీ నేతలకు మాత్రం అమరావతిలో పాలనా రాజధాని వల్ల కలిగే లాభాలు ఏంటి? విశాఖ వాసులు అసంతృప్తి వ్యక్తం చేసే పరిపాలనా రాజధానిపై మీరు అంతగా ప్రేమ కనబరచడం వల్లే ఈ ప్రశ్నలు వేయాల్సి వస్తోంది.
రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే దూరాభారమవుతుందని , ఈ విషయంలో సీమవాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. ఒకే మీరు చెప్పేది బాగానే ఉంది. దూరాన్ని బట్టి రాజధానులు నిర్ణయించేదే నిజమైతే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాజధానులు చెన్నై, త్రివేండ్రం, కోల్‌కతా నగరాలు ఆ రాష్ట్రాల నడిబొడ్డున ఉన్నాయా?
ఈ ప్రశ్న అడగాలని లేదు కానీ, మిమ్మల్ని ప్రశ్నించక తప్పడం లేదు. మీరు మొదటి వివాహం విశాఖ అమ్మాయిని, రెండో వివాహం పూణే యువతిని, ముచ్చటగా మూడో వివాహం రష్యా యువతిని చేసుకోలేదా? ఏం మీరు నివాసం ఉండే హైదరాబాద్ అమ్మాయిని ఎందుకు చేసుకోలేకపోయారు?
హైదరాబాద్‌లో అమ్మాయిలు లేరా? పోనీ విశాఖ అమ్మాయిని పక్కన పెడదాం. ఇంకా మీ విషయంలో మరో మినహాయింపు కింద మహారాష్ట్రకు చెందిన రెండో మాజీ భార్య రేణూదేశాయ్‌ని కూడా పక్కన పెడదాం. మీరు చెబుతున్నట్టు దూరమే కారణమైతే రష్యా యువతిని వివాహమాడేవారా? ఎక్కడ రష్యా, ఎక్కడ ఆంధ్రా? మిమ్మల్ని కలిపింది ‘మనసులు’ కాదా? మీకో నీతి, రాష్ట్ర ప్రజలకు మరో నీతా? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా సార్?
నిన్ను పుట్టించిన మీ అయ్య వచ్చినా మమ్మల్ని భయపెట్టలేరు