హ‌మ్మ‌య్య సీఐడీ కాదు…సీబీఐః హ్యాపీ!

ఈ స‌మ‌యంలో త‌న‌పై సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డం చాలా శుభ‌ప‌రిణామ‌మ‌ని న‌ర‌సాపురం ఎంపీ  ర‌ఘురామ‌కృష్ణంరాజు అభివ‌ర్ణించారు. దీన్ని బ‌ట్టి ర‌ఘురామ‌కృష్ణంరాజులో ఎంత పాజిటివిటీ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.  Advertisement స‌హ‌జంగా సీబీఐ కేసులంటే…

ఈ స‌మ‌యంలో త‌న‌పై సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డం చాలా శుభ‌ప‌రిణామ‌మ‌ని న‌ర‌సాపురం ఎంపీ  ర‌ఘురామ‌కృష్ణంరాజు అభివ‌ర్ణించారు. దీన్ని బ‌ట్టి ర‌ఘురామ‌కృష్ణంరాజులో ఎంత పాజిటివిటీ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

స‌హ‌జంగా సీబీఐ కేసులంటే రాజ‌కీయ నేత‌లు వ‌ణికిపోతుంటారు. ర‌ఘురామ వైఖ‌రి మాత్రం అందుకు భిన్నంగా ఉండ‌డం విశేషం. బ‌హుశా ఆయ‌న‌కు సీబీఐ కంటే సీఐడీ అంటేనే కాసింత భ‌యం ఉన్న‌ట్టుంది. అందుకు కార‌ణాలు వేరే అనుకోండి.  

ప్ర‌స్తుతానికి వ‌స్తే రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్‌ భారత్‌ కంపెనీ చైర్మన్, ఎండీ అయిన‌ కె.రఘురామ కృష్ణంరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్‌ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై ఢిల్లీలోని త‌న  కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ స్పందన ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఈ ఛార్జిషీట్‌ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామమని కూడా ఆయ‌న చెప్ప‌డం మ‌రింత ఆస‌క్తి క‌లిగిస్తోంది. అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తామని ఆయన చెప్పారు.

త‌న‌పై ఇంత వ‌ర‌కూ సీబీఐ ఒక్క చార్జిషీట్ కూడా దాఖ‌లు చేయ‌లేద‌ని ప‌దేప‌దే ర‌ఘురామ చెబుతూ వ‌స్తున్నారు. ఆయ‌న కోరిక‌ను సీబీఐ ఎట్ట‌కేల‌కు తీర్చింది. సీఐడీ కాకుండా సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డం ఆయ‌న‌కు ఊర‌ట క‌లిగించే విష‌యంగా చెప్పొచ్చు. 

ఇదే సీఐడీ చార్జిషీట్ దాఖ‌లు చేసి వుంటే ఈ పాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ద‌ద్ద‌రిల్లేలా ర‌ఘురామ‌, ఆయ‌న‌కు వంత పాడే మీడియాలో గ‌గ్గోలు పెట్టేవేమో!