యూట్యూబ్ లవ్‌బర్డ్స్ షణ్ముక్, దీప్తి సునయన బ్రేకప్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీప్తి సునయన, షణ్ముక్‌లిద్దరూ బిగ్‌బాస్ రియాల్టీ షోలకు వేర్వేరు సీజన్‌లలో పాల్గొన్నారు. ఇటీవల ముగిసిన షోలో షణ్ముక్ రన్నరప్‌తో సరి పెట్టుకున్నాడు. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా దీప్తి, షణ్ముక్ బాగా పరిచయస్తులే.
ఇటీవల బిగ్‌బాస్ సీజన్-5లో షణ్ముక్ నడిపిన ప్రేమాయణం కాస్త …హౌస్ బయట వికటించింది. గత ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న తనను కాదని మరో యువతితో షణ్ముక్ కౌగిలింతలు, ముద్దులతో మునిగితేలడంతో దీప్తి హృదయం గాయపడింది. షణ్ముక్‌కు దీప్తిపై స్థిరమైన, గాఢమైన ప్రేమ లేదనే వాస్తవాన్ని బిగ్‌బాస్ రియాల్టీ షో కళ్లకు కట్టింది. తన లక్ష్యాన్ని మరిచి బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముక్ ప్రేమాటలో మునిగి, చివరికి దీప్తికి కూడా మోసం చేస్తున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో షణ్ముక్‌కు బ్రేకప్ చెబుతున్నట్టు ఇవాళ మొదటి ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజు దీప్తి సంచలన పోస్టు షేర్ చేసింది. ఈ పోస్టుపై షణ్ముక్ స్పందన ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో నర్మగర్భ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. షణ్ముక్ పోస్టుపై నెటిజన్లు తమకు తోచినట్టు అర్థాలు తీస్తున్నారు. షణ్ముక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోస్టు గురించి తెలుసుకుందాం.
'ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది. తను ఇప్పటి వరకు చాలా ఫేస్ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసుంటాం. నేను బెటర్ పర్సన్ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ దీపూ'.. అంటూ పోస్ట్ పెట్టాడు.
ఇప్పటి వరకు చాలా ఫేస్ చేసిందంటే…తనను భరించిందని షణ్ముక్ చెప్పకనే చెప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు షణ్ముక్ రాయడంపై కూడా నెటిజన్లు తమదైన కోణంలో చూస్తున్నారు. తన వల్ల ఇంత కాలం బాధలు, కష్టాలు ఎదుర్కొన్నావని, తనతో విడిపోవడం వల్ల ఇకపై అలాంటివేవీ ఉండవని షణ్ముక్ తనకు తానుగా వెల్లడించాడని నెటిజన్లు అర్థాలు తీశారు.
కావున ఇకపై సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని ముగింపు వాక్యాలు పలికాడని అంటున్నారు. ఏది ఏమైనా కొత్త సంవత్సరం మొదటి రోజు బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.