శీల పరీక్షకు సిద్ధమంటున్న కమలనాధుడు…?

ఆయన బీజేపీలో సీనియర్ నేత. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే శాసనసభలో ఆ పార్టీ పక్షాన నాయకుడిగా వ్యవహరించారు. ఆయనే విశాఖ నేత విష్ణుకుమార్ రాజు. ఆయన లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ కొన్ని…

ఆయన బీజేపీలో సీనియర్ నేత. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే శాసనసభలో ఆ పార్టీ పక్షాన నాయకుడిగా వ్యవహరించారు. ఆయనే విశాఖ నేత విష్ణుకుమార్ రాజు. ఆయన లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

తాను టీడీపీ గొంతుకతో మాట్లాడుతున్ననని, ఆ పార్టీ వాయిస్ నే వినిపిస్తున్నానని ఆరోపిస్తున్నారని వాపోయారు. అయితే తాను కరడు కట్టిన కాషాయం నేతనని ఆయన చెప్పుకున్నారు. తన శీలాన్ని శంకించడం దారుణమని కూడా మండిపడ్డారు.

ఏపీలో వైసీపీ సర్కార్ ని తొట్ట తొలిగా విమర్శించింది తానేనని ఆయన చెప్పుకున్నారు. తాను జగన్ సర్కార్ తప్పులు బయటపెట్టాక టీడీపీ వాటినే వల్లె వేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. అదే నిజమని కూడా చెప్పారు.

తాను సైకిలెక్కబోతున్నాను అంటున్న వారు ఇది గ్రహించాలని కూడా ఆయన సూచించారు. తాను సైకిలెక్కడం కాదు, టీడీపీ వారే మా వైపు వస్తారో  ఏం చేస్తారో చూడాలని ఆయన అనడం విశేషం. అంటే టీడీపీ వారు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని రాజు గారి భావనా అన్నదేఎవరికీ  తెలియడంలేదు.

ఇదిలా ఉంటే తాను టీడీపీ మద్దతుగా లేనని, సైకిలెక్కడం లేదని అర్జంటుగా రాజు గారు మీడియా ముందు చెప్పుకోవడమేంటన్న దాని మీద హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. నిప్పుంటేనే పొగ వస్తుంది అంటారు, మరి రాజు గారు ఏమైనా అలాంటి  ప్రయత్నాలు చేస్తున్నారా లేకపోతే ఎందుకు ఇలా ఖండిస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నదే చర్చగా ఉంది మరి.

ఏది ఏమైనా ఏపీలో బీజేపీ ఎత్తిగిల్లడంలేదు. పొత్తు జనసేనతో ఉన్నా ఎన్నికల నాటికి ఏ బంధం ఎలా ఉంటుందో తెలియడంలేదు. టీడీపీతో పొత్తు ఉంటే కమలనాధులకు మనసు స్థిమితంగా ఉంటుంది అంటున్నారు. లేకపోతే బీజేపీ టీడీపీ అని కాదు ఎవరరైనా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వింతా విడ్డూరం లేదని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.