డీజే భీమ్లానాయక్.. కుర్రకారుకు కొత్త బీట్

ఓవైపు ఒమిక్రాన్ భయపెడుతున్నప్పటికీ, కుర్రకారు మాత్రం తగ్గేదేలే అన్నట్టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పడిపోయింది. వీళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచేలా భీమ్లానాయక్ నుంచి డీజే వెర్షన్ వచ్చింది. ఇప్పటికే ఛార్ట్ బస్టర్ గా…

ఓవైపు ఒమిక్రాన్ భయపెడుతున్నప్పటికీ, కుర్రకారు మాత్రం తగ్గేదేలే అన్నట్టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పడిపోయింది. వీళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచేలా భీమ్లానాయక్ నుంచి డీజే వెర్షన్ వచ్చింది. ఇప్పటికే ఛార్ట్ బస్టర్ గా నిలిచిన లాలా..భీమ్లా పాటకు డీజే వెర్షన్ రిలీజ్ చేశారు. ఈరోజు రాత్రి ఈ డీజే వెర్షన్ మార్మోగిపోవడం పక్కా.

డీజే పేరిట మరీ భయంకరంగా ఈ పాటను మార్చకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. సాహిత్యం వినిపించేలా, హెవీ డ్రమ్స్ ఉపయోగించకుండా, డీజే టచ్ ఇచ్చారు. అక్కడక్కడ 'భీమ్లా' అనే పదానికి వాయిస్ మాడ్యులేషన్ వాడినప్పటికీ.. ఓవరాల్ గా పాట బాణీని యథాతథంగానే ఉంచారు. మ్యూజిక్ బిట్, బీట్ మాత్రం కొంచెం మార్చారు.

తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు, త్రివిక్రమ్ లిరిక్స్ అందించిన సంగతి తెలిసిందే. ఇక వీడియోలో కొత్త విజువల్స్ ను యాడ్ చేయలేదు. గతంలో చూపించిన పవన్ ఖాకీ లుక్, లుంగీ గెటప్ దృశ్యాల్నే మరోసారి రిపీట్ చేశారు. జూనియర్ ఆర్టిస్టుల డాన్సులు, గాయకుడు అరుణ్ ఆలపించినప్పుడు తీసిన దృశ్యాల్ని మాత్రం కాస్త తగ్గించారు.

సంక్రాంతికి రావాల్సిన భీమ్లానాయక్, శివరాత్రికి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు.