ఈ ఏడాది సమ్మర్ లో రావాల్సిన రెండు ప్రామిసింగ్ సినిమాలు టైమ్ కు రెడీ అవుతాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి ప్రశాంత్ వర్మ-తేజు సజ్జా కాంబినేషన్ లోని హనుమాన్..రెండవది బోయపాటి-రామ్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా. ఈ రెండు సినిమాలు చకచకా వర్క్ జరుపుకుంటున్నాయి. కానీ మే లో విడుదలకు టైమ్ సరిపోతుందా అన్నదే అనుమానం.
హనుమాన్ సినిమాకు గ్రాఫిక్స్ కీలకం. ఈ సినిమా టీజర్ మంచి రీచ్ కు చేరుకోవడానికి కారణం అందులో వున్న సిజి వర్క్ నే. హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుంది. ఇండియన్ సూపర్ హీరో సిరీస్ లాంటిది ఇది. అందుకే సిజి వర్క్ చాలా కీలకం. సినిమాలో ఓ కీలకమైన బ్లాక్ వుంది. సిజి వర్క్ అంతా అయిన తరువాత ఆ బ్లాక్ ఎలా వచ్చింది అన్నది చూసుకుని, అంతా బాగుంది అనుకుంటేనే మే లో విడుదల చేస్తారట. లేదూ అంటే కాస్త వెనక్కు వెళ్లే ఆలోచన వుందని తెలుస్తోంది.
బోయపాటి-రామ్ సినిమా షూట్ చకచకా జరుగుతోంది. మే లో విడుదల..కాదు జూలై లో డేట్ పెట్టుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తి చేసి బాలకృష్ణ మీదకు వెళ్లాలి బోయపాటి. ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని చేస్తున్నారు. దీనికి నిర్మాత చిట్టూరి శ్రీను. కాస్త గట్టిగానే ఖర్చు చేస్తున్నారు. యాక్షన్ బ్లాక్ లకు కాస్త ఎక్కువ టైమ్ నే పడుతోంది. అందువల్ల ఈ సినిమా డేట్ మీద కాస్త క్లారిటీ రావాల్సి వుంది.
ప్రస్తుతానికి మే నెలలో గోపీచంద్ రామబాణం, నాగ్ చైతన్య కస్టడీ సినిమాలు వున్నాయి. ఇంకా రెండు వారాలు లేదా అంటే మరో నాలుగు సినిమాలకు చాన్స్ వుంది. కానీ ఏ సినిమా కూడా రెడీ అవుతున్న దాఖలాలు లేవు. మే, జూన్ తెలుగు సినిమాలకు సరైన సీజన్.