అతిలోకసుందరి శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో ఒకరు ఆల్రెడీ హీరోయిన్ అయిపోయారు. జాన్వి కపూర్ చాన్నాళ్ల కిందటే సినిమాల్లోకి వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు జాన్వి కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ వంతు వచ్చింది. అవును.. శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి వస్తోంది.
ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పింది ఖుషీ కపూర్. దీనికి సంబంధించి అగ్రిమెంట్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఆ సినిమా వివరాల్ని ఖుషీ తండ్రి, నిర్మాత బోణీ కపూర్ వెల్లడించబోతున్నాడు.
నిజానికి ఖుషీ కపూర్ కు ఇది తొలి సినిమా కాదు. నెట్ ఫ్లిక్స్ కు ఆమె ఓ ఒరిజినల్ మూవీ చేసింది. హిందీలో తెరకెక్కిన ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు తమిళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది ఈ చిన్నది.
సౌత్ కు రావడానికి జాన్వి కపూర్ చాలా టైమ్ తీసుకుంది. ముందుగా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. అలా వచ్చిన క్రేజ్ తో సౌత్ కు వచ్చింది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఖుషి మాత్రం కెరీర్ స్టార్టింగ్ లోనే సౌత్ సినిమాల వైపు మొగ్గు చూపించింది. సౌత్ లో నిరూపించుకొని, తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేయాలనేది ఆమె ప్లాన్.