ఇంకా వ‌ర్జినేనట‌..న‌మ్మండి న‌మ్మ‌క‌పొండి!

త‌ను ఇంకా వర్జినే అని ప్ర‌క‌టించుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. ఒక చాట్ షోలో స‌ల్మాన్ ఖాన్ త‌న స‌హ‌చ‌ర న‌టీన‌టుల మ‌ధ్య‌న ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించుకున్నాడు. బాలీవుడ్ జ‌నాల మ‌ధ్య‌న…

త‌ను ఇంకా వర్జినే అని ప్ర‌క‌టించుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. ఒక చాట్ షోలో స‌ల్మాన్ ఖాన్ త‌న స‌హ‌చ‌ర న‌టీన‌టుల మ‌ధ్య‌న ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించుకున్నాడు. బాలీవుడ్ జ‌నాల మ‌ధ్య‌న స‌ల్మాన్ పెళ్లి గురించి రెగ్యుల‌ర్ గా చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. అయితే అది ఇప్పుడ‌ప్పుడే జ‌రిగే ముచ్చ‌ట కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. 

అయితే స‌ల్మాన్ అప్పుడ‌ప్పుడు ఈ అంశం గురించి స్పందిస్తూ ఉంటాడు. అందులో భాగంగా త‌ను వ‌ర్జినేనంటూ ఇది వ‌ర‌కూ కూడా స‌ల్లూ ప్ర‌క‌టించుకున్నాడు. ఇప్పుడు కూడా అదే మాటే చెబుతున్నాడు స‌ల్మాన్ ఖాన్. త‌న‌కు గ‌ర్ల్ ఫ్రెండ్స్ సంఖ్య‌ను కూడా చెప్పాడు ఈ హీరో. వారు ఐదు మంది అని స‌ల్మాన్ ప్ర‌క‌టించాడు.  అంత‌మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటెయిన్ చేసినా త‌ను మాత్రం ఇంత వ‌ర‌కూ క‌ట్టు త‌ప్ప‌లేద‌న్న‌ట్టుగా స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించుకున్నాడు.

అయితే ఈ ప్ర‌క‌ట‌నను ఎంత‌మంది న‌మ్ముతార‌నే సంగ‌తి వేరే. సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే జ‌నాల‌కు కొన్ని ఒపీనియ‌న్స్ ఉన్నాయి. సినిమా హీరో లు లేటు వ‌యసు వ‌ర‌కూ పెళ్లిళ్లు చేసుకోక‌పోవడం గురించి కూడా జ‌నాల‌కు మ‌రి కొన్ని అభిప్రాయాలుంటాయి. అయితే స‌ల్మాన్ ఖాన్ మాత్రం.. త‌న వెర్ష‌న్ త‌ను చెప్పాడు. బ‌హుశా స‌ల్మాన్ ఖాన్ మాజీ గ‌ర్ల్స్ ఫ్రెండ్స్ ను పెళ్లి చేసుకున్న వాళ్ల‌కు ఈ హీరో మాట‌లు ప్ర‌శాంత‌త‌ను ఇస్తాయి కాబోలు!