స్విమ్ సూట్ లో యంగ్ హీరోయిన్ సాహ‌సాలు!

మాల్దీవుల వెకేష‌న్ నుంచి త‌న హాట్ పిక్స్ ను పోస్టు చేస్తూ ఉంది సారా అలీఖాన్. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై.. వివిధ సినిమాలు చేస్తూ త‌న ఉనికిని చాటుకుంటున్నసారా…

మాల్దీవుల వెకేష‌న్ నుంచి త‌న హాట్ పిక్స్ ను పోస్టు చేస్తూ ఉంది సారా అలీఖాన్. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై.. వివిధ సినిమాలు చేస్తూ త‌న ఉనికిని చాటుకుంటున్నసారా అలీ ఖాన్, ఇప్పుడు మ‌రింత గ్లామ‌ర్ ట‌చ్ ను ఇస్తూ ఉంది. అందు కోసం మాల్దీవుల టూర్ ను ఉప‌యోగించుకుంటూ ఉంది. అక్క‌డ నుంచి బికినీల‌తో ఫొటోల‌ను పోస్టు చేస్తూ.. వార్త‌ల్లో నిలుస్తూ ఉంది.

ఈ క్ర‌మంలో ఒకింత సాహ‌సాలు కూడా చేస్తోంది సారా. డీప్ సీ డైవింగ్ తో పాటు న‌డి స‌ముద్రంలో ఈత కొడుతూ.. ఫీట్స్ చేస్తూ ఉంది. అందుకు సంబంధించిన ఫొటోల‌ను, వీడియోల‌ను పోస్టూ చేస్తూ ఉంది. ఈ టూర్ లో సారా వెంట త‌ల్లి అమృతా సింగ్, సారా సోద‌రుడు కూడా క‌నిపిస్తూ ఉన్నారు.  ఒక‌వైపు బికినీ ఫొటోల‌తో గ్లామ‌ర్ ను, సాహ‌సాల‌తో త‌న ధైర్యాన్ని చాటుకుంటూ ఉంది సారా.