ఈ అవకాశం వాడుకోకుంటే వక్రబుద్ధి ఉన్నట్టే!

అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు.. నిజంగానే రాజధాని తరలిపోతుందనే భయంతో రైతులు చేస్తున్నవా? లేదా, రాజకీయ ప్రేరేపిత స్వార్థ శక్తులు చేస్తున్నవా? అనే సంగతి స్పష్టం అయిపోనున్నది. ఆందోళనలు చేస్తున్న వారికి మంత్రి…

అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు.. నిజంగానే రాజధాని తరలిపోతుందనే భయంతో రైతులు చేస్తున్నవా? లేదా, రాజకీయ ప్రేరేపిత స్వార్థ శక్తులు చేస్తున్నవా? అనే సంగతి స్పష్టం అయిపోనున్నది. ఆందోళనలు చేస్తున్న వారికి మంత్రి కొడాలి నాని చేసిన ప్రతిపాదన చాలా సబబుగా ఉన్నదనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. మూడు రాజధానులు చేయాలనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పటినుంచి.. అమరావతి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అధికారిక నిర్ణయం ఇప్పటిదాకా రాకపోయినప్పటికీ.. ఈ పోరాటాలు మాత్రం రోజురోజుకూ శృతి పెంచుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ప్రతిష్టంభన తొలగించడానికి ఒక ప్రతిపాదన చేశారు. అమరావతి రైతులు తమ ప్రాంత అభివృద్ధిపై అవగాహన, తమ డిమాండ్లపై స్పష్టతతో వస్తే గనుక.. వారితో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన ప్రతిపాదించారు.

మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నప్పుడు, అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రజలకు కొన్ని సందేహాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కేవలం ప్రభుత్వంతో చర్చల ద్వారా మాత్రమే ప్రతిష్టంభన తొలగుతుంది. చర్చలే జరగకుండా.. ఎన్నినెలలు ఇలాంటి నిరసనలు వెలిబుచ్చినా.. ప్రయోజనం ఉండదు. కాబట్టి… కొడాలి నాని ప్రతిపాదన అనేది.. అమరావతి ప్రతిష్టంభన తొలగడానికి ఒక మంచి ముందడుగు గానే భావించాలిస ఉంటుంది.

నిజంగానే సమస్య తీరడాన్ని కోరుకుంటున్నవారే అయితే గనుక.. అమరావతి ప్రాంత రైతులు.. చర్చలకు సిద్ధపడాలి. తమలో ఉన్న భయాలేమిటో ప్రభుత్వానికి నేరుగా చెప్పాలి. నివృత్తి చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి భరోసా తీసుకోవాలి. నిమ్మళంగా ముందుకు సాగాలి. అంతేతప్ప.. చర్చలకు ఏకంగా మంత్రి నుంచి ఇలాంటి అవకాశం వచ్చినా కూడా.. తమంత తాము ధర్నాలు చేసుకుంటూ ఉంటే గనుక.. వారేదో వక్రప్రయోజనాలు ఉద్దేశించి.. ఇలా చేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తారు.