‘నేను అసమర్థుణ్ని..’ పవన్ అఫీషియల్ ప్రకటన!

‘‘రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది- అంటే దాని అర్థం దుర్మార్గురాలు’’ అనే! పవన్ కల్యాణ్ కూడా ఇదే నీతి ప్రకారం.. తన అసమర్థతను ఒప్పుకున్నారు.  Advertisement రాజకీయ సమర్థతల గురించి బందరు సభలో…

‘‘రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది- అంటే దాని అర్థం దుర్మార్గురాలు’’ అనే! పవన్ కల్యాణ్ కూడా ఇదే నీతి ప్రకారం.. తన అసమర్థతను ఒప్పుకున్నారు. 

రాజకీయ సమర్థతల గురించి బందరు సభలో రంకెలు వేసిన జనసేనాని.. తెలుగుదేశం పార్టీ మీద తనకు ప్రత్యేకమైన ప్రేమ లేదుగానీ.. చంద్రబాబునాయుడు అంటే గౌరవం ఉందని అన్నారు. పరిపాలకుడిగా చంద్రబాబు సమర్థుడు అని ఆయన కితాబు ఇచ్చారు. 

రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు అధికారం కోసం తలపడుతూ ఉండగా.. జగన్మోహన్  రెడ్డిని పరమ దుర్మార్గుడిగా చిత్రీకరించడమే తన జీవితాశయంగా మాట్లాడుతూ ఉండే పవన్ కల్యాణ్ , అదే సమయంలో చంద్రబాబునాయుడు సమర్థుడు అంటూ కితాబులు ఇవ్వడం విశేషం. 

ఒక రకంగా చెప్పాలంటే.. తెలుగు ప్రజలు కూడా కొందరు గతంలో ఇలాంటి భ్రమల్లోనే ఉన్నారు. కాబట్టే ఆ కొంతమంది 2014 లో చంద్రబాబునాయుడు చేతిలో అధికారం పెడితే రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని భ్రమించారు. వారి భ్రమలకు తోడు అప్పట్లో మోడీ హవా, పవన్ కల్యాణ్ లతో కలిసిన పొత్తు బంధం ఉపయోగపడడంతో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. 

కానీ.. ఆయన ఎంతటి సమర్థుడో ప్రజలు తెలుసుకున్నారు. అయిదేళ్ల పాలన బాధ్యతలు అప్పగించిన తెలుగు ప్రజలు.. చంద్రబాబునాయుడు సమర్థుడో అసమర్థుడో చాలా చక్కగా గ్రహించి, అసహ్యించుకుని 2019 ఎన్నికల్లో దారుణంగా తెలుగుదేశాన్ని ఓడించారు. 

రాష్ట్రంలోని తెలుగు ప్రజలు, సామాన్యులు అందరూ చంద్రబాబునాయుడు అసమర్థతను గుర్తించారు గానీ.. ఆయన పల్లకీ మోయడానికి ఉవ్విళ్లూరుతున్న పవన్ కల్యాణ్ మాత్రం.. ఇంకా ఆయనలోని సమర్థత గురించిన భ్రమల్లోనే బతుకుతున్నారు. 

చంద్రబాబునాయుడు సమర్థత గురించిన భ్రమల్లోంచి బయటకు రాకపోవడమే పవన్ కల్యాణ్ అసమర్థతకు పెద్ద తార్కాణం అని ప్రజలు అంటున్నారు. ఆయన సమర్థత మీద అంత నమ్మకం ఉంటే, అయిదేళ్లలో ఆయన ఏం చేశారో పవన్ చెప్పాలని, ఒకవేళ నిజంగా ఆయన చేసిందేమైనా ఉంటే.. ఆయనతో పొత్తు బంధం వదిలించుకుని పవన్ బయటకు ఎందుకు వచ్చారో కూడా జనానికి సంజాయిషీ ఇవ్వాలని అడుగుతున్నారు. 

ఒకవైపు మీరంతా జనసేనకు అండగా ఉండండి.. జనసేనకు ఓట్లు వేయండి అని అడుగుతూ.. మరోవైపు చంద్రబాబునాయుడు సమర్థుడు అని అదే బహిరంగ వేదిక మీదినుంచి ప్రకటించడంలోని ఔచిత్యం ఏమిటో పవన్ కే తెలియాలి.