అక్కినేని అమల…ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు. శివ సినిమాలో నాగార్జున సరసన నటించి, ఆ తర్వాత రియల్ లైఫ్‌లో కూడా జీవిత భాగస్వామి అయ్యారామె. ఆ తర్వాత సినిమాలకు క్రమంగా దూరమయ్యారు. జంతు ప్రేమికురాలిగా అప్పుడప్పుడు వార్తల్లో అమల కనిపిస్తుంటారు.
తాజాగా మళ్లీ సినిమాలో అమల నటించడంపై భర్త నాగార్జున అభినందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1993లో అమల నటించిన చివరి చిత్రం ‘ఆగ్రహం’ . ఆ తర్వాత 19 ఏళ్లకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో అమలు కనిపించారు. అక్కినేని కుటుంబ సమేతంగా నటించిన ‘మనం’ చిత్రంలో డ్యాన్స్ టీచర్‌గా అమలు అలరించారు. ఇదే సందర్భంలో ‘కేరాఫ్ సైరాభాను’ అనే మలయాళ సినిమాలో నటించారు.
తాజాగా మరోసారి అమల పూర్తి స్థాయిలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఒకే ఒక జీవితం’ అనే చిత్రంలో అమల క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. శర్వానంద్ హీరోగా, రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది.
ఈ టీజర్‌తో పాటు తన శ్రీమతి అమలను కూడా అభినందిస్తూ నాగార్జున ట్వీట్ చేశారు. ‘నిన్ను మళ్ళీ తెరపై చూడడం ఆనందంగా ఉంది అమల. ‘ఒకే ఒక జీవితం టీమ్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అమలు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.