పిల్లలకు పాఠాలు చెప్పమంటే పోర్న్ చూపించాడు

చేతిలో సెల్ ఫోన్, అందులో డేటా.. ఈ రెండూ ఉంటే చాలు.. ఏదైనా చూడొచ్చు, ఎంతసేపయినా చూడొచ్చు. ఆ చూసేది మంచిదా కాదా అనేది చూసేవారి విజ్ఞత. ఇక్కడే చాలామంది తప్పులు చేస్తున్నారు. బూతు…

చేతిలో సెల్ ఫోన్, అందులో డేటా.. ఈ రెండూ ఉంటే చాలు.. ఏదైనా చూడొచ్చు, ఎంతసేపయినా చూడొచ్చు. ఆ చూసేది మంచిదా కాదా అనేది చూసేవారి విజ్ఞత. ఇక్కడే చాలామంది తప్పులు చేస్తున్నారు. బూతు వీడియోలకు అలవాటు పడుతున్నారు. వీటికి బానిసై చివరకు మరిన్ని తప్పులు చేస్తున్నారు. ఇలాంటి తప్పులు చేసిన ఓ ఉపాధ్యాయుడు ఇప్పుడు పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యాడు.

మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని ఓ టీచర్ కి బూతు వీడియోలు చూసే అలవాటు ఉంది. ఆ అలవాటుతో అతడు మరింత నీఛుడిగా తయారయ్యాడు. ఐదో తరగతి చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. చివరకు వారికి కూడా బూతు వీడియోలు చూపించి కటకటాలపాలయ్యాడు.

ఐదో తరగతి విద్యార్థులకు సెల్ ఫోన్ లో బూతు వీడియోలు చూపించాడు టీచర్. 8 మంది పిల్లలను దగ్గరకు తీసుకుని వారికి బూతు వీడియోలు చూపిస్తూ, వారి ప్రైవేట్ భాగాలను తాకుతూ రాక్షసానందం పొందాడు. ఆ కీచక టీచర్ వయసు 52 ఏళ్లు. మరో ఎనిమిదేళ్లలో రిటైర్ అవబోతున్నాడు.

ఈ లేటు వయసులో అతగాడి బుద్ధి గడ్డితిన్నది. ట్రాక్ రికార్డ్ మరీ దారుణంగా ఏమీ లేదు. గతంలో మంచి టీచర్ గా పేరుతెచ్చుకున్నవాడే. కానీ ఇటీవల సెల్ ఫోన్ లో బూతు వీడియోలకు అలవాటు పడి ఇలా చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు.

తీరా పిల్లలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తప్పు అతడిదేనని తేల్చారు. ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సదరు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. రిటైర్మెంట్ కి దగ్గరైన వయసులో ఉద్యోగం పోయింది, అటు సమాజంలో పరువూ పోయింది.