Advertisement

Advertisement


Home > Politics - National

సిన్సియర్ ఉద్యోగి.. భార్యను చంపి డ్యూటీకి వెళ్లిన భర్త

సిన్సియర్ ఉద్యోగి.. భార్యను చంపి డ్యూటీకి వెళ్లిన భర్త

పని రాక్షసుడు అంటే అతనే. అతను నిజంగానే రాక్షసుడు, పనిలోనూ రాక్షసుడు. ఉదయం భార్యను చంపి నేరుగా ఆఫీస్ కి వెళ్లాడు. సాయంత్రం ఆఫీస్ పని పూర్తి చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఉదయాన్నే భార్యను చంపానని పోలీసులకు చెప్పాడు. మరి ఇంతవరకు ఏం చేశావంటే.. ఆఫీస్ పని చూసుకుని వచ్చానన్నాడు. పోలీసులు షాకయ్యారు. అతడు చెప్పేది నిజమో కాదో తేల్చుకోడానికి ఇంటికెళ్లారు. భార్య శవం చూసి రూఢీ చేసుకున్నారు. భర్తను కటకటాల వెనక్కు నెట్టారు.

ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాలో జరిగింది. నల్సాపోర ప్రాంతంలో భార్య, భర్త నివశించేవారు. భార్య గృహిణి కాగా, భర్త ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా ఆమెతో గొడవలు పడుతున్నాడు. రాత్రి కూడా ఆమెతో తీవ్రంగా గొడవపడిన భర్త, తెల్లవారు ఝామున కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. డ్యూటీకి టైమ్ కాగానే ఉద్యోగానికి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఆఫీస్ లోనే భోజనం చేశాడు, సాయంత్రం నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.

మధ్యలో ఏంజరిగింది..?

భార్యను చంపిన భర్త ఆఫీస్ కి ఎందుకెళ్లినట్టు, తిరిగి పోలీసులకు ఎందుకు లొంగిపోయినట్టు అనేది అర్థం కావడంలేదు. ఉన్మాదంతో భార్యను చంపి, ఆ హత్యనుంచి తప్పించుకునే ఆలోచన చేసి ఉంటాడని, అది వర్కవుట్ కాక, ఆఫీస్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చాడని అనుమానిస్తున్నారు.

మొత్తమ్మీద తన తప్పు తానే పోలీసుల ముందు ఒప్పుకుని లొంగిపోయాడు సదరు హంతక భర్త. అతడు పనిచేసే ఆఫీస్ కొలీగ్స్ హడలిపోతున్నారు. హత్య చేసి నింపాదిగా ఆఫీస్ కి వచ్చి తమతో కలసి పనిచేశాడని తెలిసి షాకయ్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?