Advertisement

Advertisement


Home > Politics - National

35 ఏళ్ల కిందటి ప్రేమ... ఇప్పుడు ఫ్రెష్ గా లేచిపోయారు

35 ఏళ్ల కిందటి ప్రేమ... ఇప్పుడు ఫ్రెష్ గా లేచిపోయారు

జాను సినిమాలో హీరోహీరోయిన్లు లాంగ్ గ్యాప్ తర్వాత రీయూనియన్ లో భాగంగా కలుస్తారు.. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు.. కానీ అప్పటికే హీరోయిన్ కు పెళ్లయిపోతుంది. కాబట్టి ఆమె మళ్లీ హీరో జ్ఞాపకాలతో భర్త దగ్గరకు వెళ్లిపోతుంది. కానీ కేరళలో ఓ ఘటన దీనికి రివర్స్ లో జరిగింది. రీ యూనియన్ లో భాగంగా కలిసిన మాజీ ప్రేమికులు, తిరిగి ఎవరింటికి వాళ్లు వెళ్లలేదు. ఎంచక్కా కొత్త కాపురం పెట్టారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటూ ఇటీవల కాలంలో చాలామంది పాత స్నేహితులు ఒకేచోట కలుసుకుంటున్నారు. ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడినవారంతా ఒకేచోట చేరుకుంటున్నారు. అలాంటి సందర్భంలో స్కూల్ డేస్ లో చేసిన అల్లర్లు, చిలిపి పనులు, ప్రేమ వ్యవహారాలు అన్నీ గుర్తొస్తాయి. అలా గుర్తు చేసుకుని వాటిని ఆ తర్వాత మరచిపోవాలి కానీ.. ఆ ప్రేమను ఇప్పుడు తట్టిలేపడమంటే అది సాహసమనే చెప్పాలి. అందులోనూ అప్పటికే పెళ్లై, పిల్లలు పుట్టినా కూడా పాత ప్రేమను కొనసాగించాలనుకోవడం పాపమనే చెప్పాలి.

కానీ ఆ ముదురు జంటకు అవేవీ పట్టలేదు. పెళ్లి, పిల్లలు, కుటుంబం ఇవేవీ గుర్తు రాలేదు. స్కూల్ డేస్ లో జరిగిన ప్రేమ వ్యవహారమే గుర్తొచ్చింది. అంతే, ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి కాపురం పెట్టారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆ జంట స్టేషన్ కి వచ్చింది.

కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇడుక్కి ప్రాంతాలకు చెందిన మహిళ క్లాస్ మేట్స్. స్కూల్ టైమ్ లో వారి మధ్య లవ్ ఎఫైర్ ఉంది. అయితే టెన్త్ తర్వాత వారెప్పుడూ కలసుకోలేదు. ఆ తర్వాత ఎవరికి వారు పెళ్లి చేసుకున్నారు కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకి 35 ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్ పార్టీలో క్లాస్ మేట్స్ అంతా మువట్టుపుజ అనే ఊరిలో కలుసుకున్నారు.

వారిలో ఈ ఇద్దరు ప్రేమికులు కూడా ఉన్నారు. ఇప్పుడు వారి వయసు 50 ఏళ్లు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, షుగర్, బీపీ వచ్చిందా అని మాట్లాడుకునే వయసు. కానీ వారు ప్రేమ ఊసులు చెప్పుకున్నారు. స్కూల్ డేస్ లో ధైర్యం చేయలేకపోయాం, ఇప్పుడు లేచిపోతే మనల్ని ఎవడ్రా ఆపేది అని ఫిక్స్ అయ్యారు. అందరిలాగా ఫొటోలు దిగి ఎవరింటికి వారు వెళ్లకుండా.. ఒకేచోటకు లేచిపోయారు.  

మువట్టు పుజ నుంచి వారు తిరువనంతపురం, పాలక్కడ్ ప్రాంతాల్లో విహార యాత్రలు చేయడం మొదలు పెట్టారు. ఈలోగా కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. నా భర్త కనపడటం లేదు అని అతడి భార్య, నా భార్య మిస్ అయింది అంటూ ఆమె భర్త వారి వారి జిల్లాల్లో కేసులు పెట్టారు. పోలీసులకు ఈ రెండు కేసుల మధ్య లింకు దొరికింది. తీగలాగారు, వారిద్దరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. చివరకు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పంచాయితీ పెట్టారు. ఈ ముదురు ప్రేమికుల్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?