ఓట్లు భారీగా చీలాయా… వైసీపీ ధీమా ఏంటి….?

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో జరిగాయి. అధికార వైసీపీ వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా ఎన్నికల వేడి కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వామపక్ష అభ్యర్ధులతో పొత్తు ఉందని బాహాటంగా చాటారు. వైసీపీ…

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో జరిగాయి. అధికార వైసీపీ వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా ఎన్నికల వేడి కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వామపక్ష అభ్యర్ధులతో పొత్తు ఉందని బాహాటంగా చాటారు. వైసీపీ వ్యతిరేక ఓట్లలో చీలిక ఉండరాదని స్పష్టం చేశారు. ద్వితీయ ప్రాధాన్యతా ఓటు పీడీఎఫ్ అభ్యర్ధులకు వేయమని పార్టీ వారికి పిలుపు ఇచ్చారు.

అయితే అది ఉత్తరాంధ్రాలో పెద్దగా వర్కౌట్ కాలేదని ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ వారు తమ ఓటు తమ అభ్యర్ధికి వేసుకున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే గట్టిగానే పోరు సాగింది. ఒక విధంగా దీన్ని చతుర్ముఖ పోటీగా చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ నేత కావడంతో వారు తమ ప్రయత్నం తాము చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కి కొంచెం ముందుగా టీడీపీ తన అభ్యర్ధిని మార్చింది. పోటీ పరీక్షలకు విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే వేపాడ చిరంజీవిరావు యూత్ ఓట్లను చాలా వరకూ కొల్లగొట్టారని పోలింగ్ అనంతర పోస్ట్ మార్టం లెక్కలు చెబుతున్నాయట. దాంతో గెలుపు తమదే అనుకుని ధీమా పడిన పిడిఎఫ్ అభ్యర్ధికి టీడీపీ అనూహ్యంగా జోరు చేయడంతో ఓట్ల చీలిక భారీగా జరిగిందన్న అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు.

అధికార వైసీపీ అభ్యర్ధి సుధాకర్ చాప కింద నీరులా తమ అధికార బలంతో పాటు బాగానే పెర్ఫార్మ్ చేశారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ సీటు మేము గెలుచుకోవడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు భారీగా చీలిపోవడం వల్ల ఫ్యాన్ పార్టీ తొలిసారిగా ఎమ్మెల్సీ సీటుని గెలుచుకున్నా అశ్చర్యం లేదని అంటున్నారు. ఈ నెల 16న అసలు తీర్పు ఏమిటి అన్నది బయటపడాల్సి ఉంది.