మళ్లీ మారిన పవన్ సినిమాల ఆర్డర్

పవన్ కల్యాణ్ సినిమాలు ఏ ఆర్డర్ లో వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి పవన్ కల్యాణ్ కూడా చెప్పలేడు. ఈయన సినిమాల ఆర్డర్ మొత్తం గజిబిజి గందరగోళం అనే విషయాన్ని గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడీ…

పవన్ కల్యాణ్ సినిమాలు ఏ ఆర్డర్ లో వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి పవన్ కల్యాణ్ కూడా చెప్పలేడు. ఈయన సినిమాల ఆర్డర్ మొత్తం గజిబిజి గందరగోళం అనే విషయాన్ని గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడీ ఆర్డర్ మరోసారి మారింది.

ప్రస్తుతం వినోదాయశితం రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్. ఈ మూవీతో పాటు హరిహర వీరమల్లు సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇది ఫిక్స్. ఈ సినిమాల తర్వాత లైనప్ ఏంటనేది అంతా కన్ఫ్యూజన్.

ఈ క్రమంలో పవన్ చేయాల్సిన సినిమాల్లో ఒకటి ముందుకు, ఇంకోటి ఇంకాస్త వెనక్కి వెళ్లింది. అదే సుజీత్, సురేందర్ రెడ్డి సినిమాలు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా చాన్నాళ్ల కిందటే ఎనౌన్స్ అయింది. కానీ ఇప్పుడా ప్రాజెక్టు పక్కకెళ్లిపోయింది.

ఆ కాల్షీట్లను సుజీత్ సినిమాకు కేటాయించాడు పవన్. వచ్చే నెల నుంచి పవన్-సుజీత్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ గ్యాప్ లో వినోదాయ శితం సినిమాను పూర్తిచేసి, సైమల్టేనియస్ గా ఉస్తాబ్ భగత్ సింగ్ ను కూడా స్టార్ట్ చేయాలనేది పవన్ ప్లాన్.

మొత్తానికి ఎప్పుడో ప్రకటించిన సురేందర్ రెడ్డి సినిమా సైడ్ అవ్వగా, తాజాగా తెరపైకొచ్చిన సుజీత్ సినిమా సెట్స్ పైకి రావడానికి రెడీ అవ్వడం కొసమెరుపు. అయితే ఇవన్నీ ఇప్పటికిమాత్రమే అప్ డేట్స్. మరో నెల రోజుల్లో ఈ ఆర్డర్ ఇంకెంత మారిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు.