ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సమంత

సమంత మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. ఈసారి పూర్తిగా కుటుంబ ప్రేక్షకులే తన టార్గెట్ అని ఆమె ప్రకటించింది. శాకుంతలం సినిమాకు కుటుంబ ప్రేక్షకులు పోటెత్తుతారనే గట్టి నమ్మకంతో ఉంది సమంత.…

సమంత మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది. ఈసారి పూర్తిగా కుటుంబ ప్రేక్షకులే తన టార్గెట్ అని ఆమె ప్రకటించింది. శాకుంతలం సినిమాకు కుటుంబ ప్రేక్షకులు పోటెత్తుతారనే గట్టి నమ్మకంతో ఉంది సమంత.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. శాకుంతలం సినిమా ఫస్ట్ కాపీని సమంత చూసింది. సినిమా చూసి ఆమె ఫ్లాట్ అయింది. మేకింగ్ తో గుణశేఖర్ తన మనసు గెలుచుకున్నారని, సినిమాలోని పవర్ ఫుల్ ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ చలించిపోతారని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఓ గొప్ప ఇతిహాసానికి గుణశేఖర్ మనోహరంగా జీవం పోశారని, శాకుంతలం సినిమాను ఇంతకంటే అందంగా ఎవ్వరూ తీయలేరని అభిప్రాయపడింది సమంత. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్, నిర్మాతలు నీలిమ గుణ, దిల్ రాజుతో కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేసింది.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే ఇతిహాసం ఆధారంగా తెరకెక్కింది శాకుంతలం సినిమా. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఏప్రిల్ 14న థియేటర్లలోకి వస్తోంది శాకుంతలం సినిమా.