విజ‌య‌శాంతి పారితోష‌కాలు ఏ స్థాయిలో అంటే!

సౌత్ లో లేడీ సూప‌ర్ స్టార్ ట్యాగ్ ను సంపాదించుకున్న న‌టి విజ‌య‌శాంతి. గ్లామ‌ర‌స్ పాత్ర‌లతో మొద‌లుపెట్టి.. మంచి న‌టిగా పేరు తెచ్చుకుని.. యాక్ష‌న్ సినిమాల్లో కూడా చేసి.. హీరోల‌కు ధీటైన ఇమేజ్ సంపాదించుకున్న…

సౌత్ లో లేడీ సూప‌ర్ స్టార్ ట్యాగ్ ను సంపాదించుకున్న న‌టి విజ‌య‌శాంతి. గ్లామ‌ర‌స్ పాత్ర‌లతో మొద‌లుపెట్టి.. మంచి న‌టిగా పేరు తెచ్చుకుని.. యాక్ష‌న్ సినిమాల్లో కూడా చేసి.. హీరోల‌కు ధీటైన ఇమేజ్ సంపాదించుకున్న న‌టి విజ‌య‌శాంతి.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. విజ‌య‌శాంతి కొంత‌మందికి దూరం అయ్యిందేమో కానీ, న‌టిగా మాత్రం పాత సినిమాల‌తో ఇప్ప‌టికీ త‌నకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగి ఉంటుంది. చాలా సంవ‌త్స‌రాలుగా మేక‌ప్ కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఆమె సినిమా అవ‌కాశాల‌ను వెదుక్కోలేదు. సినిమాలే ఆమెను వెదుక్కొంటూ వెళ్లాయి. ఈ ర‌కంగా కూడా విజ‌య‌శాంతి సూప‌ర్ స్టార్ డ‌మ్ రుజువు అయ్యింది.

ఇప్పుడు విజ‌య‌శాంతి వివిధ అంశాల గురించి మాట్లాడుతూ ఉంది. త‌న కెరీర్ లో ఎత్తుప‌ల్లాల‌ను ఆమె వివ‌రించింది. ప్ర‌తిఘ‌ట‌న సినిమా చేసిన‌ప్పుడు త‌న వ‌య‌సు 18 యేళ్లు అని విజ‌య‌శాంతి చెప్పింది. ఆ సినిమాలో ఒక లెక్చ‌ర‌ర్ గా ఆమె రాణించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌తో ప‌ని చేసిన ద‌ర్శ‌కుల్లో టీ కృష్ణ‌ను మాత్రం ఆమె బాగా ప్ర‌శంసించింది. ఇక త‌న‌తో ప‌ని చేసిన హీరోల గురించి ఇది వ‌ర‌కూ కూడా విజ‌య‌శాంతి పెద్ద‌గా మాట్లాడేది కాదు. ఇప్పుడు కూడా ఆమె ఇంట‌ర్వ్యూల్లో వారి ఊసు ఎత్త‌డం లేదు.

ఇక పారితోష‌కాల విష‌యానికి వ‌స్తే.. 13 యేళ్ల‌కే న‌టిగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఐదు వేల రూపాయ‌ల పారితోష‌కంతో మొద‌లుపెట్టింద‌ట‌. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడు కోటి రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్ కూడా అందుకున్న‌ట్టుగా విజ‌య‌శాంతి చెప్పింది. రీ ఎంట్రీ విష‌యంలో కూడా సినిమా రూప‌క‌ర్త‌లే ఆమె ఒప్పించి తీసుకొచ్చారు కాబ‌ట్టి.. భారీ పారితోష‌క‌మే తీసుకుని ఉండ‌వ‌చ్చు!