ఆర్ఆర్ఆర్ కు ఎన్ని కష్టాలో

భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలకు అన్నీ కష్టాలే కనిపిస్తున్నాయి. అయినా విడుదల తప్పని పరిస్థితీ కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడి ఇక్కడకు చేరింది. ఇప్పడు వాయిదా వేసే అవకాశం లేదు.…

భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలకు అన్నీ కష్టాలే కనిపిస్తున్నాయి. అయినా విడుదల తప్పని పరిస్థితీ కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడి ఇక్కడకు చేరింది. ఇప్పడు వాయిదా వేసే అవకాశం లేదు. నిజానికి అక్టోబర్ నాటికే సినిమా రెడీ అయిపోయింది. అప్పుడు విడుదల చేసి వుంటే వేరుగా వుండేది. సంక్రాంతి బరిలోకి దిగాలనే సంకల్పంతో ఆగిపోయారు.

అదీ మంచిదే అయింది. సినిమా ప్రచారానికి కావాల్సినంత టైమ్ దొరికింది. ఆర్ఆర్ఆర్ సినిమాను నార్త్ లో, సౌత్ లో చాలా ఎక్కువగా పబ్లిసిటీ చేసారు. అది బాగానే వర్కవుట్ అవుతోంది కూడా. 

కానీ సమస్య ఏమిటంటే కరోనా మూడోదశ కలవర పెడుతోంది. చాలా చోట్ల యాభై శాతం ఆక్యుపెన్సీ, అలాగే సెకెండ్ షో లేకపోవడం వంటి సమస్యలు వున్నాయి. ఢిల్లీ లాంటి చోట్ల థియేటర్లే మూత పడ్డాయి. మహరాష్ట్ర, ఢిల్లీ అనేవి హిందీ సినిమాలకు ఆయువు పట్టులాంటి ప్లేస్ లు. 

అలాగే యుఎస్ లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. పిల్లలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇది జనాలను సహజంగానే కొంత వరకు భయపెడుతుంది. ఎంత సినిమా మీద ప్రేమ వున్నా ఫ్యామిలీలు బయటకు రావడానికి జంకుతాయి. 

ఆంధ్రలో టికెట్ రేట్లు సంగతి తెలిసిందే. 140 కోట్లకు విక్రయించారు ఆంధ్ర, సీడెడ్ కలిపి. ఇప్పుడు ఈ రేట్ల మీద అయితే అంత డబ్బులు వసూలు చేయడం అసాధ్యం. ప్రభుత్వం ఆ మధ్య అఖండ సినిమాకు చేసినట్లు చూసీ చూడనట్లు వదిలేస్తే 100,150 అమ్ముకోగలిగితే కొంత వరకు ప్రయోజనం వుంటుంది. అప్పుడు కూడా 140 కోట్ల టార్గెట్ కష్టమే. పైగా స్పెషల్ రేట్లు వుండవు.

కొత్త రేట్లు 7 వతేదీ లోగా వస్తాయా? అన్నది అనుమానం. అవి వస్తే కాస్త ఊరట కలుగుతుంది. ఎందుకంటే మూసుకున్న చాలా థియేటర్ల తెరచుకుంటాయి. లేదూ అంటే అసలే తక్కువ రేట్లు ఆపై థియేటర్ల కొరత అన్నది వెంటాడుతుంది. 

ఇదిలా వుంటే ప్రస్తుతానికి తెలుగురాష్ట్రాల్లో ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ మును ముందు ఎలా వుంటుందో తెలియదు.  సరిగ్గా రెండు వారాల క్రితం నార్త్ లో ఇప్పుడున్న పరిస్థితి లేదు. ఇన్ని సమస్యలు వున్నా ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాల్సిందే.

ఎందుకంటే ఓవర్ సీస్ లో టికెట్ లు అమ్మేసారు. థియేటర్లు బుక్ చేసారు. ఇప్పుడు క్యాన్సిల్ అంటే బయ్యర్లు పెద్ద మొత్తంలో పెనాల్టీలు కట్టుకోవాల్సి వుంటుంది.  ఇన్ని సమస్యల నడుమ ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయడం అంటే నిజంగా కత్తి మీద సామే. 

ఆర్ఆర్ఆర్…వర్కవుట్ ఎలా?

ఆర్ఆర్ఆర్ ను ఆంధ్ర ఏరియాకు 100 కోట్ల మేరకు విక్రయించారు.  విక్రయించినపుడు వున్న ధీమా ఏమిటి అంటే 300 యూనిఫారమ్ రేటు అమ్మేసుకోవచ్చు అని.  కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  కనీసం వన్ వీక్ 300 రేటు అమ్మకుంటే వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు.
పోనీ నిర్మాత తెగించి డిస్ట్రిబ్యూషన్ గా మార్చేస్తాను అంటే వడ్డీల ప్రశ్న వస్తోంది. ఎప్పుడో అడ్వాన్స్ లు కట్టి వున్నారు. వాటికి ఇన్నాళ్లుగా వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అది నిర్మాత ఇచ్చుకోవాల్సి వుంటుంది.